చేవెళ్ల జామామసీద్ కమిటీని రద్దు చేయండి
చేవెళ్ల: అభివృద్ధిని అడ్డుకుంటూ అవకతవకలకు పాల్పడుతున్న చేవెళ్లలోని జామామసీద్ కమిటీని రద్దుచేసి నూతన కమిటీని నియమించడానికి చర్యలు తీసుకోవాలని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్‌హుస్సేన్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ.జహంగీర్, వార్డు సభ్యుడు ఎండీ.ఖలీల్, మైనార్టీ మండల నాయకులు ఎస్‌డీ.రహీమ్, ఎండీ.యూనుస్, జలీల్‌ఖాన్, షరీఫ్, యూసుఫ్ శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. జామామసీద్ కమిటీ ఈద్గాలు, మసీద్‌ల అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. గతనెలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ వేడుకలను బహిష్కరించిన మసీద్‌కమిటీకి పాలకవర్గంగా కొనసాగే అర్హత లేదన్నారు. దర్గావద్ద అసంపూర్తిగా ఉన్న నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు దాతలు ముందుకువస్తే కొంతమంది కావాలని మసీద్ కమిటీ నాయకులు అడ్డుకుంటున్నారని, ఇదేనే వారు ము స్లింలకు చేసే సేవ అంటూ మండిపడ్డారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ మసీద్‌కమిటీలో చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.మసీద్‌లో రాజకీయాలు చేస్తున్న ఉద్యోగులపై ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మసీద్‌కమిటీని రద్దుచేయాలని డిమాండ్‌చేశారు.