సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలం హిమకుంట్లలో గురువారం సాయంత్రం విద్యుత్‌లైన్‌కు మరమ్మతులు చేస్తూ కాంట్రాక్టు కార్మికుడు నారాయణ(21) తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యల్లనూరు మండలం వెంకటాంపల్లెకు చెందిన నారాయణ (21) విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడుగా పని చేస్తుండే వాడు. ఈ నేపథ్యంలో హిమకుంట్ల ఫీడర్‌లో మరమ్మతులు చేస్తున్న ఆయన షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.