అక్రమ టపాసుల పట్టివేత | Capture of illegal cracars | Sakshi
Sakshi News home page

అక్రమ టపాసుల పట్టివేత

Published Tue, Oct 25 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

Capture of illegal cracars

రాయచోటి టౌన్‌: దీపావళి పండుగ వస్తుండటంతో టపాసుల అక్రమ వ్యాపారాలు జోరందుకున్నాయి. టపాసుల వ్యాపారానికి సంబంధించి లైసెన్స్‌ కలిగిన వారికి పోలీసులు ఇప్పటికే కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అలాగే లైసెన్స్‌ లేకుండా, అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిపై నిఘా పెట్టారు. వీరి వలలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయారు. పట్టణంలోని గాంధీ బజార్‌ దగ్గరలోని వీధిలో అక్రమంగా టపాసుల వ్యాపారం చేస్తున్న రఫీవుల్లా బేగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న టపాసులను వారు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగేశ్వరరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement