బాక్సైట్ వ్యతిరేకించినందుకు ఏయూ ఫ్రొఫెసర్ పై కేసు | case on au proffesor for opposing boxite | Sakshi
Sakshi News home page

బాక్సైట్ వ్యతిరేకించినందుకు ఏయూ ఫ్రొఫెసర్ పై కేసు

Published Tue, Nov 17 2015 10:15 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

case on au proffesor for opposing boxite

పాడేరు ( విశాఖపట్నం) : బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆంధ్రయూనివర్సిటీ ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏజెన్సీలో బాకై్సట్ తవ్వకాలపై టీడీపీ సర్కార్ ఇచ్చిన జీవోకి వ్యతిరేకంగా ఏయూలో ఫ్రొఫెసర్ పనిచేస్తున్న జెర్రా అప్పారావు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్ తీరుపై ఘాటుగా స్పందించారు.

పదిహేను రోజుల క్రింత జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు పరిశీలించారు. మంగళవారం రాత్రి ఫ్రొఫెసర్ అప్పారావుపై కేసు నమోదు చేశారు. మావోలకు సానుభూతి పరుడిగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులు విషయాన్ని పొక్కనీయకుండా ఉంచారు. ఆయన భార్య, ప్రజా సంఘాలు ఆందోళన చేయగా విడిచిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement