ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి : డీఎస్పీ | celeberates festivol in pieace wheather | Sakshi
Sakshi News home page

ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి : డీఎస్పీ

Published Fri, Sep 2 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి : డీఎస్పీ

ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి : డీఎస్పీ

కోదాడఅర్బన్‌: త్వరలో రానున్న వినాయక చవితి, బక్రీద్‌ పండుగలను పట్టణ ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకొని, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్‌ కోరారు. శుక్రవారం కోదాడ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని పబ్లిక్‌ క్లబ్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన శాంతిసంఘం సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశాంతతకు మారు పేరైన కోదాడ పట్టణంలో మతసామరస్యంతో ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేవారు ఎలాంటి పోరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి డీజే అనుమతులు లేవని, ఈ విషయంలో ఎవరైనా నిబంధనలు ఉలఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వంటిపులి అనిత, పట్టణ సీఐ రజితారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీదేవి, పట్టణ ఎస్‌ఐ సురేష్‌కుమార్, పలు పార్టీల నాయకులు, గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు,  వివిధ మతాలకు చెందిన మత పెద్దలు, పలు çస్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు  పాల్గొన్నారు.
 

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement