హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్తో మరోసారి చైనా బృందం భేటీ అయ్యింది. అంజూ ఇన్ఫ్రా, రాడిక్ కన్సల్టెంట్ ప్రతి నిధులు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గోదావరి నుంచి మిడ్ మానేరు టన్నెల్, మూసినదిపై వంతెన.. హుస్సేన్ సాగర్ సమీపంలో అత్యంత ఎత్తైన భవన నిర్మాణ సముదాయానికి ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని కోరారు. దీంతో నెల రోజుల్లో నివేదిక ఇస్తామని చైనా ప్రతినిధులు బదులిచ్చారు.