తహసీల్దారు ఆస్తుల స్వాధీనంపై కలెక్టర్‌ సీరియస్‌ | collector serious on tahasildar office properties seized | Sakshi
Sakshi News home page

తహసీల్దారు ఆస్తుల స్వాధీనంపై కలెక్టర్‌ సీరియస్‌

Published Sat, Jun 10 2017 12:25 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

collector serious on tahasildar office properties seized

 -కోర్టులో నగదు జమచేసి ఆస్తులను విడిపించాలని ఆదేశం
జూపాడుబంగ్లా:  ‘తహసీల్దారు కార్యాలయ ఆస్తులు జప్తు’అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ స్పందించారు. ఈ ఘటనపై డిప్యూటీ కలెక్టర్‌ తిప్పేనాయక్, ఇన్‌చార్జి తహసీల్దారు రమణారావులపై మండిపడ్డారు. శనివారం ఉదయం వారిద్దరితో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్‌ వెంటనే కోర్టులో మొత్తాన్ని చెల్లించి తహసీల్దారు కార్యాలయ ఆస్తులను విడిపించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటినా తిప్పేనాయక్‌ నందికొట్కూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో బాధితులకు చెల్లించాల్సిన రూ.12వేల మొత్తాన్ని జమచేసి జప్తుచేసిన జూపాడుబంగ్లా తహసీల్దారు కార్యాలయ ఆస్తులను విడిపించి సీనియర్‌ అసిస్టెంటు మీనాకుమార్‌కు అప్పగించారు. ఎస్సార్బీసీ అధికారులు బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం సకాలంలో చెల్లించకపోవడంతో అందుకు జూపాడుబంగ్లా తహసీల్దారు కార్యాలయ ఆస్తులు జప్తుచేయాలని నందికొట్కూరు సీనియర్‌సివిల్‌జడి​‍్జ గురువారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement