కాలేజీ విద్యకు జాతీయస్థాయిలో మెరుగైన స్థానం | College education study better position on the national level | Sakshi
Sakshi News home page

కాలేజీ విద్యకు జాతీయస్థాయిలో మెరుగైన స్థానం

Published Tue, Aug 9 2016 8:25 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

College education study better position on the national level

రాష్ట్రంలో ఉన్నత విద్యలో ప్రమాణాల పెంపునకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆ శాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ఉన్నత విద్యలో పలు అంశాల్లో ఏపీ మెరుగైన స్థానాలు సాధించిందన్నారు. జాతీయస్థాయిలో మహిళా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రథమస్థానం, అటానమస్, పాలిటెక్నిక్ కాలేజీల్లో రెండు, ఇంజనీరింగ్ కాలేజీల్లో మూడు, లక్షమందికి ఒక కాలేజీ, ఇంజనీరింగ్‌లో విద్యార్ధుల చేరికలు, ఇంజనీరింగ్ కాలేజీలకు అక్రిడిటేషన్ విషయాల్లో నాలుగో స్థానంలో ఏపీ నిలిచిందని చెప్పారు. డిప్లొమో కోర్సుల్లో విద్యార్ధుల చేరికల్లో 5వ స్థానంలో, డిగ్రీ కాలేజీల సంఖ్యలో, విద్యార్థి టీచర్ నిష్పత్తిలో ఏడో స్థానంలో, గ్రాస్ ఎన్రోల్‌మెంటు రేషియోలో 8వస్థానంలో ఏపీ నిలిచిందని ఉదయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement