
మాట్లాడుతున్న మురళీమనోహర్
ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్
సిద్దిపేట రూరల్: కమ్యూనిస్టులు దళితులను అడ్డుపెట్టుకుని దేశద్రోహ కుట్రలు పన్నుతున్నారని ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ తెలిపారు. ఆదివారం మండలంలోని తడ్కపల్లి ఆవాస విద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ విభాగ్ అబ్యాస వర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మద్య విద్వేశాలు రెచ్చగొట్టేందుకు కమ్యూనిస్టులు కులాల పేరుతో చిచ్చుపెడుతున్నారన్నారు. దళితులను అడ్డుపెట్టుకుని అగ్రవర్ణాలే రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదే విధంగా దేశంలో విష సంస్కృతులైన భీప్ ఫెస్టివల్, కిస్ ఆఫ్ లవ్‌తో పాటు మంగళసూత్రాలు తంపే విష సంస్కృతిని ప్రజల్లోకి తీసుకోస్తున్నారని మండిపడ్డారు. కమ్యూనిజం అనేది తియ్యటి విషపుగుళిక అని పెరియార్ చెప్పిన మాటలను గుర్తు చేశారు.
విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న కమ్యూనిస్టు కుట్రలను ఆరికట్టేందుకు ఏబీవీపీ కార్యకర్తలే ముందుండాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో మనుషుల మధ్య ఉండేది కులాలు కాదని, ప్రతి ఒక్కరు భారతీయుడని చెప్పుకునే రోజులు రావాలన్నారు. అంతకు ముందు సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి కలాల్ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు, సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ దూది శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షులు చంద్రోజు శ్రీనివాస్, ఏబీవీపీ నాయకులు గంగాడి మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విష్ణు, మధు, ఆవాస విద్యాలయ నిర్వహకులు కొమురవెళ్లి చంద్రశేఖర్, పాఠశాల ప్రధానాచార్యులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.