పరస్పర సహకారంతో రైతులకు సేవలు | cooperate to formers | Sakshi
Sakshi News home page

పరస్పర సహకారంతో రైతులకు సేవలు

Published Wed, Sep 28 2016 8:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

పరస్పర సహకారంతో రైతులకు సేవలు

పరస్పర సహకారంతో రైతులకు సేవలు

  • నష్టాల నుంచి గట్టెక్కుతున్న డీసీఎంఎస్‌
  • ప్రతీ సొసైటీలో త్వరలో గోదాంల నిర్మాణం
  • కొత్త జిల్లాలకు డీసీఎంఎస్‌ కార్యాలయాల నిర్మాణం
  • డీసీఎంఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి
  • కరీంనగర్‌ అగ్రికల్చర్‌ : రైతుల శ్రేయస్సే లక్ష్యంగా జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ముందుకు సాగుతోందని డీసీఎంస్‌ చైర్మన్‌ ముదుగంటి సురేందర్‌రెడ్డి తెలిపారు.కరీంనగర్‌లోని డీసీఎంస్‌ సంఘ కార్యాలయంలో బుధవారం జరిగిన 68వ సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మార్చి 28న నిర్వహించిన మహాసభ తీర్మానాలను ధ్రువీకరించారు. ఏప్రిల్‌ 2015 నుంచి మార్చి 2016వరకు జరిగిన లావాదేవీలపై సమీక్షించి ఆమోదించారు. రాష్ట్రప్రభుత్వం జగిత్యాల, పెద్దపల్లిని నూతన జిల్లాలుగా ప్రతిపాదించడంతో ఆయా ప్రాంతాల్లో డీసీఎంఎస్‌ కార్యాలయాలు, గదుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.1.20 కోట్ల నష్టాన్ని రూ.61 లక్షల వరకు పూడ్చినట్లు చెప్పారు. సిరిసిల్ల, హుజురాబాద్, జమ్మికుంట, మంథని ప్రాంతాల్లోని డీసీఎంఎస్‌ ఆస్తులను పకడ్బందీగా కాపాడినట్లు పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో సహకార సంఘాలు పోటీపడకుండా డీసీఎంఎస్‌కు సహకరించాలని కోరారు. ప్రైవేట్‌ కంపెనీలను నియంత్రించి మేలు రకాలైన సర్టిఫైడ్‌ విత్తనాలను డీసీఎంఎస్‌ ద్వారానే రైతులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, సబ్సిడీ విత్తనాలను అందుబాటులో ఉంచి సరఫరా చేస్తామని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంçఘాల చైర్మన్‌ టి.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రతీ సొసైటీకి గోదాంల నిర్మాణంతోపాటు సంఘ భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు వుచ్చిడి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల సౌకర్యమే లక్ష్యంగా విలువైన స్థిరాస్తులను కాపాడుకుంటూ లాభాల దిశగా వ్యాపారం చేయాలని సూచించారు. అంతకుముందు మేనేజర్‌ నివేదిక సమర్పించారు. సమావేశంలో డైరెక్టర్‌లు కె.గోపాల్‌రెడ్డి, నాంపెల్లి(జానీ), జి.పోతీలాల్, బి.లోకేశ్‌కుమార్, ఎం.కోటేశ్వర్, టి.దామోదర్, డి.లక్ష్మీనారాయణ, జి.కృష్ణారెడ్డి, బిజినెస్‌ మేనేజర్‌ ఆర్‌.వెంకటేశ్వర్‌రావు, కరీంనగర్‌ ఏడీఏ శ్రీధర్, మార్క్‌ఫెడ్‌ డీఎం శ్యామ్‌కుమార్, టీఎస్‌ సీడ్స్‌ డీఎం.కొండాల్‌రెడ్డి  పాల్గొన్నారు.
     
     

Advertisement
Advertisement