సీపీఐ సీనియర్‌ నాయకుడి మృతి | CPI senior leader died | Sakshi
Sakshi News home page

సీపీఐ సీనియర్‌ నాయకుడి మృతి

Published Sat, Aug 6 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

సీపీఐ సీనియర్‌ నాయకుడి మృతి

సీపీఐ సీనియర్‌ నాయకుడి మృతి

రామన్నపేట
భారతకమ్యూనిస్టు పార్టీ  సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఎర్ర అర్జున్‌(58) శనివారం మృతిచెందాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రామన్నపేట గ్రామపంచాయతీ పరిధి కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన అర్జున్‌ గీతకార్మికవృత్తిని కొనసాగిస్తూనే సీపీఐ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశారు. గీతపనివారల సంఘం అధ్యక్షుడిగా, సీపీఐ మండల కార్యదర్శిగా, రామన్నపేట ఎంపీటీసీగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన మృతిపట్ల పార్టీ మండలకార్యదర్శి ఊట్కూరి నర్సింహ, ఎంపీటీసీ ఊట్కూరి శోభ, మాజీవైస్‌ఎంపీపీ మునుకుంట్ల నాగయ్య, ఉపసర్పంచ్‌ కూనూరు క్రిష్ణగౌడ్, నాయకులు గంగాపురం యాదయ్య, బడుగు రఘు, వి.భగవంతం, దండుగల సమ్మయ్య, ఎర్ర శేఖర్, శివరాత్రి సమ్మయ్య సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement