క్రికెట్‌ బుకీ అరెస్టు | cricket bookie arrest | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బుకీ అరెస్టు

Published Thu, Dec 29 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

cricket bookie arrest

కడప అర్బన్‌ :  కడప నగరంలోని రవీంద్రనగర్‌ మరాఠివీధిలో నివసిస్తున్న పాగల విశ్వనాథరెడ్డి అనే క్రికెట్‌ బుకీని గురువారం మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు. గురువారం రాత్రి వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.  విశ్వనాథరెడ్డి 2015లో తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధిలో, 2016లో టుటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో రెండు క్రికెట్‌ బుకీల కేసుల్లో నిందితుడిగా ఉండి అరెస్టు అయ్యాడన్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాపాకిస్తాన్‌ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించి ఎవరైనా క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడే వారు అతని దగ్గరికి వస్తారేమోనని చెన్నూరుకు చెందిన మరో బుకీ మాధవరెడ్డి తనవద్ద ఉన్న రూ. 4 లక్షలు, అలాగే కిలో గంజాయిని నిందితుడు విశ్వనాథరెడ్డికి ఇచ్చి వెళ్లాడన్నారు. అదే సమయంలో తమ ఎస్‌ఐలు నాగరాజు, ప్రతాప్‌రెడ్డిలకు వచ్చిన సమాచారంతో సిబ్బందితో దాడి చేశారన్నారు. విశ్వనాథరెడ్డి నుంచి రూ. 4 లక్షల నగదు, సెల్‌ఫోన్, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారన్నారు. మాధవరెడ్డి పరారీలో ఉన్నాడని తెలిపారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement