
పబ్లిసిటీ కోసం పంటను తొక్కేశారు!
బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రంలో సోమవారం రాత్రి వర్షం బాగా కురిసింది. అయినా కూడా రాష్ట్ర మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ యామినీబాల, వందలాది మంది టీడీపీ నాయకులు, వారికి తోడుగా అధికారులు రెయిన్‌గన్ పనితీరును పరిశీలించడానికి వచ్చారు. మంచి పదును అయిన వేరుశనగ పంట పొలంలో రెయిన్‌గన్‌ను పరిశీలించారు. వచ్చినోళ్లంతా పంటను తొక్కేయడంతో బాధిత రైతు వెంకటేష్ లబోదిబోమన్నారు.