
ఆయకట్టు చివరి భూములకు నీళ్లివ్వాలి
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూములకు నీరిప్పించడానికి శుక్రవారం పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి చొప్పదండికి వెళ్లిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధికారులను
పెద్దపల్లి : ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూములకు నీరిప్పించడానికి శుక్రవారం పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి చొప్పదండికి వెళ్లిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధికారులను కలిసి ఎస్సారెస్పీ డి83, 86 కాలువలకు నీళ్లివ్వాల్సిందిగా ఆదేశించారు. కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లోని ఎస్సారెస్పీ చివరి భూములకు నీళ్లు రావడం లేదని కొద్దిరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నది విదితమే. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చొప్పదండి ఎస్సారెస్పీ అధికారులను కలిసి తమ ప్రాంతానికి కావాల్సిన మరింత నీటిని విడుదల చేయాలని కోరారు.