ప్రతి ఉద్యోగి మొక్కలు నాటాలి
ఆదిలాబాద్ అగ్రికల్చర్: జిల్లాలో పనిచేస్తున్న ప్రతి విద్యుత్ శాఖ ఉద్యోగి మొక్కలు నాటాలని తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణి ప్రాజెక్టు హెచ్‌ఆర్‌డి డెరైక్టర్ బి వెంకటేశ్వర్‌రావు, అపరేషన్ డెరైక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం జిల్లా కేద్రంలోని విద్యుత్ కార్యాలయ అవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం హరితహారం రెండోవిడిత కార్యక్రమం ఎంతో ప్రతిష్టత్మంగా చెపడుతుందని..ఇందులో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. చెట్లు అంతరించి పోవడం మూలంగా వాతావరణ కాలుష్యం, గ్లోబల్‌వార్మ్‌షన్ పెరగడంతో ఎండలు మండిపోతున్నాయని దీంతో విద్యుత్ వినియోగం కూడ అధికంగా ఉంటుందన్నారు.
చెట్లను పెంచడం వలన వాతావరణ చల్లగా ఉండడంతో పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్టంలో విద్యుత్ వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ఇతర రాష్ట్రలనుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. అడవులను పెంచడం వలన వర్షాలు సమృద్దిగా కురిసి జలవనరులు పెరిగి విద్యుత్ ప్రాజెక్టులు సైతం అభివృద్ది చెందతాయని పేర్కొన్నారు. విద్యుత్‌ప్రాజెక్టులు పెరిగితే రాష్ట్రానికి అవసరాలకు అనుగుణంగా మనమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునన్నారు. జిల్లాలో ప్రతి సబ్‌స్టేషన్ పరిధిలో వంద మొక్కలునాటలన్నారు. దీంతో పాటు ఇంటి అవరణలో మొక్కలు నాటి సంసరంక్షణ భావితరాలుకు ఉపయోగకరంగా ఉండేలా చూడలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ జేఆర్‌చౌహన్, డిఈలు ఏడిలు, ఏఈలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.