లక్షల విలువ చేసే దుస్తులు మాయం | designer case opposite on one courier company | Sakshi
Sakshi News home page

లక్షల విలువ చేసే దుస్తులు మాయం

Published Tue, Sep 20 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

designer case opposite on one courier company

బంజారాహిల్స్‌ : విలువైన దుస్తులు మాయం చేశారంటూ ప్రముఖ డిజైనర్‌ ఓ కొరియర్‌ సంస్థపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 10లో ప్రముఖ డిజైనర్‌ సుమన్ షరాఫ్‌ అంగసూత్ర డిజైనరీ షోరూం నిర్వహిస్తున్నారు. ఆమె ఈ నెల 12న ఆమె వైజాగ్‌లోని తమ బొటిక్‌కు ఇక్కడి నుంచి బి–4 లాజిస్టిక్స్‌ కొరియర్స్‌ నుంచి 9 పార్శిల్స్‌ను పంపించారు. ఈ పార్శిల్స్‌ను కొరియర్‌ బాయ్‌ శివరాం తీసుకున్నాడు.

ఈ నెల 13న పార్శిల్‌ వైజాగ్‌కు చేరుకోగా పార్శిళ్లను విప్పి చూడగా అందులో ఖరీదైన తొమ్మిది డిజైనరీ దుస్తులు కనిపించలేదు. వీటి విలువ రూ. 4.4 లక్షలు ఉంటుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోపేర్కొన్నారు. ఈ మేరకు బీ–4లాజిస్టిక్స్‌ కొరియర్స్, కొరియర్‌ బాయ్‌ శివరాంపై ఐపీసీ సెక్షన్ 406,420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement