స్టార్టప్‌లతో అభివృద్ధి
రెడ్ మాడ్ లెర్నింగ్ సంస్థ వ్యవస్థాపకుడు మాధవ రెడ్డి
ఏఎన్‌యూ: స్టార్టప్‌ల ద్వారా సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని రెడ్ మాడ్ లెర్నింగ్ సంస్థ వ్యవస్థాపకుడు మాధవ రెడ్డి అన్నారు. యూనివర్సిటీ సీఈడీ (సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్) అధ్వర్యంలో బుధవారం‘ స్టార్టప్ పథకం’పై జరిగిన సదస్సులో మాధవ రెడ్డి ప్రసంగించారు. సామాజిక ప్రగతికి సమాజంలో నెలకొన్న విభిన్న ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికి పరిశ్రమలే ఉత్తమ పరిష్కారాన్ని చూపుతాయన్నారు. స్టార్టప్‌ను ప్రారంభించటానికి వయస్సు, నిధులు ఆటంకం కాదని వినూత్న ఆలోచనలు, పట్టుదల ఉంటే అన్నీ సాధ్యమవుతాయన్నారు. నిధుల దుర్వినియోగం, మార్గదర్శకులు లేకపోవటమే అధిక శాతం పరిశ్రమలు మూతపడటానికి కారణమన్నారు. విద్యార్థులు నూతన ఆలోచనలతో పరిశ్రమల స్థాపకు ముందుకు రావాలని సూచించారు. వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ శ్రద్ధచూపి, కొద్దిపాటి కష్టాన్ని తీసుకోవటానికి సిద్ధపడితే పరిశ్రమల స్థాపన, వాటిని విజయపథంలో నడపటం సాధ్యమవుతుందన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. విడ్రీమ్ ఎల్యూషన్స్ డైరెక్టర్లు నజీర్‌బాషా, మధు మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని అంశాలపై శిక్షణ, అవగాహన ఇవ్వటానికి ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 10, 11 తేదీల్లో విశాఖపట్నంలో స్టార్టప్ జాతీయ సదస్సు నిర్వహిస్తోందనానరు. ఏఎన్‌యూ సీఈడీ డైరెక్టర్ ఆచార్య అబ్ధుల్ నూర్‌భాషా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కామర్స్ విభాగ అధ్యాపకులు డాక్టర్ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.