ఆచారి అరెస్టుకు నిరసన | dharna against aacharees arrest | Sakshi
Sakshi News home page

ఆచారి అరెస్టుకు నిరసన

Published Wed, Sep 14 2016 1:10 AM | Last Updated on Mon, Jul 29 2019 7:38 PM

dharna against aacharees arrest

ఆమనగల్లు: దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆమనగల్లు పట్టణంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేశారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా వెంటనే ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆచారిని అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని డివిజన్‌ ఏర్పాటయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షుడు పత్యానాయక్, మండల బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ నాయకులు సూండురి శేఖర్, రేవళ్ళి రాజు, కిరణ్, అక్తర్‌పాషా, వెంకటయ్య, అశోక్, రమేశ్‌గౌడ్, నందు, యాదగిరి, జంగంసాయిలు, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
దీక్ష భగ్నం సరికాదు
వెల్దండ:  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి నిర్వహిస్తున్న దీక్షను పోలీలు భగ్నం చేయడం సరికాదని టీడీపీ మండల అధ్యక్షులు సింహారెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌ సాధన కోసం ఆచారి గత ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేయించడం సిగ్గుచేటన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి రెవెన్యూ డివిజన్‌ సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement