విస్తరిస్తున్న మధుమేహం | diabetic day | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న మధుమేహం

Published Sat, Nov 12 2016 6:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

విస్తరిస్తున్న మధుమేహం

విస్తరిస్తున్న మధుమేహం

లబ్బీపేట : మధుమేహ వ్యాధి ప్రస్తుతం అతివేగంగా విస్తరిస్తుందని పిన్నమనేని సిద్ధార్థవైద్య కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ జీ ఈశ్వర్‌ అన్నారు. మన దేశంలో 40 ఏళ్ల పై వయస్సు వారు ప్రస్తుతం 69.2 శాతం ప్రజలు మధుమేహ వ్యాధితో భాదపడుతున్నారని, అది 2040 నాటికి 123.5 శాతానికి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల బయోకెమిస్ట్రీ విభాగం ఆ«ధ్వర్యంలో  ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యవక్తగా పాల్గొన్న డాక్టర్‌ జి ఈశ్వర్‌ మాట్లాడుతూ  ప్రపంచంలో 592 మిలియన్‌ల ప్రజలు మధుమేహ వ్యాధితో భాపడుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహ వ్యాధితో భాదపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అది 2040 నాటికి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందన్నారు. మ«ధుమేహ వ్యాధిపై అనేక చేదు నిజాలను విద్యార్ధినిలకు వివరించారు. అనంతరం డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌ శివరామకష్ణయ్య మాట్లాడుతూ ప్రపంచంలో మధుమేహ వ్యాధి అతివేగంగా పెరుగుతుందన్నారు. స్థూలకాయం, వత్తిడిలు మధుమేహ వ్యాధికి కారణాలుగా పేర్కొన్నారు. గర్భిణీలు, టైప్‌1, టైప్‌ 2 మదుమేహ వ్యాధుల గురించి ఆయన వివరించారు. మంచి ఆహార నియమాలు, చక్కటి వ్యాయామం  ద్వారా వ్యాధిని అధిగమించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ టి విజయలక్ష్మి, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి ఎ హారిక, ఎస్‌ మాధురి తదితరులు పాల్గొన్నారు.





 

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement