18న జిల్లా బ్రాహ్మణ సంఘ ఎన్నికలు | district brahmana community meeting | Sakshi
Sakshi News home page

18న జిల్లా బ్రాహ్మణ సంఘ ఎన్నికలు

Published Fri, Sep 9 2016 9:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

district brahmana community meeting

బోట్‌క్లబ్‌ (కాకినాడ) : 
జిల్లా బ్రాహ్మణ సంఘ ఎన్నికలు ఈనెల 18న స్థానిక విద్యుత్‌నగర్‌ వినాయకుడి ఆలయ సమీపంలో ఉన్న చల్లా ఫంక్షన్‌హాల్‌లో జరుగుతాయని సంఘ అధికార ప్రతినిధి చల్లా శ్రీనివాస నిరంజన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొన్నాడ హనుమంతరావు బృందం ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున ఓటు వేసేందుకు అనుమతిస్తామన్నారు. అదే రోజు సాయంత్రం ఐదుగంటలకు ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. వివరాలకు 99123 06322లో సంప్రదించాలన్నారు.