లక్ష్యం నిర్దేశించుకుంటే భవిష్యత్తు
ఆత్మకూరురూరల్: విద్యార్థులు తప్పనిసరిగా లక్ష్యం నిర్దేశించుకోవాలని ఆ మేరకు సాధన చేస్తే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఎస్పీ విశాల్‌గున్నీ పేర్కొన్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఆంధ్రా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి జరిగిన వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులు తమ చదువు పూర్తయినా ఇంగ్లిష్‌లో వెనుకబడటంతో భవిష్యత్‌ను నిర్దేశించుకోలేకున్నారన్నారు. మాతృభాషతో పాటు పరభాషల్లోనూ ప్రావీ ణ్యం సాధించాలన్నారు. ప్రతి రోజూ కనీసం అరగంట సేపు అయినా ఇంగ్లిష్ పత్రికలు చదవాలన్నారు. సెల్‌ఫోన్లలో వచ్చే సమాచారాన్ని నమ్మడం సరికాదన్నారు. మాజీ ఎమ్మె ల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు మాట్లాడుతూ కష్టపడి చదివి తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం ముఖ్య మంత్రి ప్రతిభా అవార్డు సాధించిన విద్యార్థికి షీల్డు, సర్టిఫికెట్‌ను ఎస్పీ అందజేశారు. కళాశాల చైర్మన్ బ్రహ్మనాయుడు, సెక్రటరీ రాజశేఖర్, కరస్పాండెంట్ వసంత్, ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్, సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ శ్రీనివాస చక్రవర్తి, డీఎస్పీ కెఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి : ఆత్మకూరురూరల్: రోడ్డు ప్రమాదాలను నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఎస్పీ విశాల్‌గున్నీ పేర్కొన్నారు. శనివారం ఆయన డీఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలుగా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, రానురాను పూర్తిస్థాయిలో తగ్గించేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు పోలీసులు దగ్గర కావాలని ఈ సందర్భంగా అన్నారు. గత నెలలో జరిగిన ఎస్పీ టోర్నమెంట్‌లో మారుమూల ప్రాంతాల నుంచి యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ప్రస్తుతం నెల్లూరు పట్టణంలోని ఆరు ప్రధాన పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆటోమేటెడ్ రిసెప్షన్ సెంటర్లు ప్రారంభించామన్నారు. త్వరలో జిల్లా అంతటా విస్తరింపజేస్తామని తెలిపారు. ఈ రిసెప్షన్ సెంటర్ల ద్వారా పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఆయన వెంట డీఎస్పీ సుబ్బారెడ్డి, ఎస్సై పూర్ణచంద్రరావు ఉన్నారు.