ముదిరాజ్‌లను బీసీ–ఎలో చేర్చొద్దు | Do not put Mudiraj Under BC | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌లను బీసీ–ఎలో చేర్చొద్దు

Published Tue, Jan 3 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

ముదిరాజ్‌లను బీసీ–ఎలో చేర్చొద్దు

ముదిరాజ్‌లను బీసీ–ఎలో చేర్చొద్దు

► గంగపుత్రులకు  అన్యాయం చేయవద్దు
► గంభీరావుపేటలో ర్యాలీ


గంభీరావుపేట : ముదిరాజ్‌ కులస్తులను బీసీ–ఎ జాబి తాలో చేర్చి తమకు అన్యాయం చేయవద్దని గంగపుత్ర సంఘం నాయకులు డిమాండ్‌ చేశా రు. ఈమేరకు సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్‌ఐ కార్తీక్‌కు వినతిపత్రం ఇచ్చా రు. గంగపుత్రుల మనోభావాలను దెబ్బతీసే లా వ్యవహరించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. చేపల వృత్తి ముదిరాజ్‌లదని, గంగపుత్రులకు అన్యాయం చేసేలా సీఎం కేసీఆర్‌ ప్రకటించ డం విడ్డూరంగా ఉందన్నారు. సర్కారు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గంగపుత్రులను ఎస్‌టీ జాబితాలో చేర్చుతూ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు కూర దేవేందర్, మండల అధ్యక్షుడు కరువారి శంకర్, నాయకులు దామోదర్, కాత మల్లేశం, శ్రీధర్, శ్రీనివాస్, ధర్మపురి, శ్రీకాంత్, దేవేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement