విజయవాడ: అవధాన సామ్రాట్ డాక్టర్ మేడసాని మోహన్ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. తెలుగు ప్రాచీన వాంగ్మయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సీఎంకు వినతిపత్రం సమర్పించారు. తంజావూరు గ్రంథాలయంలో వివిధ రూపాల్లో వున్న తెలుగు వాంగ్మయ గ్రంథాలు, ఆధారాలను తిరిగి తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని మేడసాని కోరారు. తంజావూరు గ్రంథాలయంలో వేంకటాచలం విశేషాలతో కూడిన అమూల్య పుస్తకాలు ఉన్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ అంశాలను పరిశీలిస్తామని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు.
చంద్రబాబును కలిసిన మేడసాని మోహన్
Published Wed, Jul 20 2016 8:02 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
Advertisement
Advertisement