స్వగ్రామం చేరిన మృతదేహం | edanna dead body reached village | Sakshi
Sakshi News home page

స్వగ్రామం చేరిన మృతదేహం

Jul 6 2017 10:12 AM | Updated on Sep 5 2017 3:22 PM

స్వగ్రామం చేరిన మృతదేహం

స్వగ్రామం చేరిన మృతదేహం

ఈదన్న (35) గత నెల 26న గుండెపోటుతో మృతి చెందాడు.

లోకేశ్వరం(ముథోల్‌): కుటుంబాన్ని పోషించుకునేందుకు విదేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకు వస్తానని చెప్పి బహ్రెయిన్‌కు వెళ్లిన మండల కేంద్రానికి చెందిన ఈదన్న (35) గత నెల 26న గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామంలో పాలేరుగా పనిచేస్తున్న సాకలి ఈదన్న గతేడాది రూ.3 లక్షలు అప్పుచేసి బహ్రెయిన్‌కు వెళ్లాడు.

గత నెల26న బహ్రెయిన్‌లో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారం వచ్చింది. అప్పటినుంచి మృతుని కుటుంబసభ్యులు 11రోజులుగా మృతదేహంకోసం రోదిస్తూ ఎదురుచూస్తూ ఉన్నారు. కాగా బుధవారం శవపేటిక ఇంటికి చేరింది. ఈదన్నకు భార్య గంగామణి, ఇద్దరు కుమార్తెలు దీపిక, దివ్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement