బహుదూర్‌పురా: కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన సంఘటన కాలపత్తర్ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ రుద్రభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... కాలపత్తర్ తాడ్‌బంద్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రవూఫుద్దీన్(46), షబానా బేగం భార్యాభర్తలు. 13 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ఓ కూతురు(12) ఉంది. అయితే వీరు విడాకులు తీసుకొని మూడేళ్లుగా వేరుగా ఉంటున్నారు.
అయినా రవూఫుద్దీన్ తరచూ భార్య వద్దకు వెళ్లేవాడు. ఇదే క్రమంలో ఈ నెల 24న భార్య ఇంటికి వెళ్లిన రవూఫుద్దీన్ తన మైనర్ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న షబానా మంగళవారం కాలపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 376, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.