
గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం
చెన్నూరు : చెన్నూరు కొండపేట వంతెన వద్ద ఆదివారం గల్లంతైన వడ్డె రాముడు(25) మృతదేహం సిద్దవటం మండలం లింగంపల్లె సమీపంలో మంగళవారం లభ్యమైంది. పెన్నానది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సుమారు 17 కిలోమీటర్ల దూరం వరకు మృతదేహం కొట్టుకుపోయింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచగిరికి చెందిన వడ్డె రాముడు(25) కోసం రెండు రోజులుగా మండల పరిధిలోని నదిలో మృతుని బంధువులు, పోలీసులు గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు సిద్దవటం మండలానికి చెందిన వారు అక్కడి ఎస్‌ఐకి లింగంపల్లె వద్ద ఓ మృతదేహం ఉందని చెప్పడంతో ఆయన చెన్నూరు ఎస్‌ఐ వినోద్‌కుమార్‌కు తెలియజేశారు. అక్కడికి వెళ్లి నదిలోనుంచి మృతదేహాన్ని బయటకు తీయించి మృతుని బంధువులకు చూపించగా గుర్తుపట్టారు. రిమ్స్‌లో శవపరీక్ష అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించామని ఎస్‌ఐ వివరించారు.