విచార వదనం | Sad Atmosphere in Chennur | Sakshi
Sakshi News home page

విచార వదనం

Published Mon, Dec 5 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

Sad Atmosphere in Chennur

చెన్నూరు : పెన్నానదిలో గల్లంతైన వడ్డె రాముడు(25) కోసం సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆ దోని మండలం బైచగరికి చెందిన రాముడు కొండపేట వంతెన వద్ద ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. విష యం తెలుసుకొన్న ఆయన బంధువులు, గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున వంతెన వద్దకు వచ్చారు. యువకులు నది వెంట గాలింపు చర్యలు చేపట్టారు. వంతెన వద్దే తిండి తిప్పలు లేక విచార వదనంతో ఉన్న వారికి కొండపేటకు చెందిన దా త భోజనం ఏర్పాటు చేశారు. నది వెంట ఎంతగా గాలించినా ఫలితం లేదని బాధితులు వాపోయారు. పోలీసులు గాలింపు చర్యలకు సహకరించలేదని, తాము స్టేషన్‌ వద్దకు వెళ్లినా పట్టించుకోలేదంటూ వా రు వాపోయారు. సోమవారం రాత్రి 8 గంటల వరకు బాధిత కుటుంబం, బం ధువులు వారి పిల్లలు, మహిళలు రోదిస్తూ వంతెనపైనే ఉన్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ తాము జాలర్లను పిలిపించి, వెతికించామని రాత్రి 7 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి 10 మందిని జాలర్లతో వెతికిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement