నెల్లూరు: పెన్నా నదిలో శనివారం ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నది మధ్యలో ఇసుకదిబ్బపై వాళ్లు ఉండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
సాక్షి టీవీ సమాచారంతో స్పందించిన అధికారులు .. పెన్నా బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. తహసీల్దార్‌తో పాటు పోలీసులు కూడా వచ్చారు. చిక్కుకున్న వాళ్లను మత్యకారులుగా భావిస్తున్నారు. బోట్ ద్వారా వాళ్లను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
సోమశిల నుంచి పెన్నాకు నీటిని విడుదల చేయటంతోనే వాళ్లు అలా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు తమ హెచ్చరికలు పట్టించుకోకుండా వాళ్లు నదిలోకి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment