rescue effort
-
Odisha tragedy: 51 గంటల నాన్‌స్టాప్ ఆపరేషన్.. ఆయన వల్లే ఇదంతా!
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన తీరు.. అక్కడి దృశ్యాలను చూసిన వాళ్లెవరైనా.. అది ఎంత తీవ్రమైందో అంచనా వేసేయొచ్చు. అలాంటిది సహాయక చర్యల దగ్గరి నుంచి.. తిరిగి పట్టాలపై ఆ రూట్లో రైళ్లు పరుగులు తీయడం దాకా.. అంతా జెట్స్పీడ్తో జరిగింది. మునుపెన్నడూ లేనంతగా కేవలం 51 గంటల్లో ఈ ఆపరేషన్ ముగిసింది. ఎలా?.. అందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. గతంలో మన దేశంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా.. రైల్వే మంత్రిని రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం, అందుకు తగ్గట్లే కొందరు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, బాలాసోర్ ఘటన వేళ.. అశ్విని వైష్ణవ్ త్వరగతిన స్పందించిన తీరు, స్వయంగా ఆపరేషన్‌ను ఆయనే దగ్గరుండి పరిశీలించడం లాంటివి ఆయన మీద ప్రతికూల విమర్శలు రాకుండా చేశాయి. ⛑️ ప్రమాదం జరిగిన గంటల్లోపే రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ఘటనా స్థలికి చేరుకున్నారు. సీఎం నవీన్ పట్నాయక్ కంటే ముందుగానే.. వేకువ ఝామున అక్కడికి చేరుకుని ప్రమాద తీవ్రతను, సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి సహాయ, పునరావాస చర్యల వేగం ఊపందుకుంది. అశ్వినీ వైష్ణవ్ ఒకప్పుడు బాలాసోర్ జిల్లాకు కలెక్టర్ గా పనిచేశారు. అలాగే.. 1999లో ఒరిస్సా(ఇప్పటి ఒడిశా) భారీ తుఫాను ముప్పును సమర్థంగా ఎదుర్కొన్న అనుభవమూ ఆయనకు ఈ సందర్భంగా పనికొచ్చాయి. ⛑️ జరిగింది భారీ ప్రమాదం. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటిది ఎరిగింది లేదు. ఒకవైపు శవాల గుట్టలు.. మరోవైపు పెద్ద సంఖ్యలో బాధితులు. పకడ్బందీ కార్యాచరణ, ప్రణాళిక లేకుండా ఈ ఆపరేషన్ ముందుకు తీసుకెళ్లడం కష్టం. ఆ స్థానంలో ఎవరున్నా ఇబ్బందిపడేవాళ్లేమో!. కానీ, విపత్తుల నిర్వహణపై ఆయనకున్న అవగాహన, గత అనుభవం.. బాలాసోర్ ప్రమాద వేళ సాయపడింది. అధికారులతో మాట్లాడి, సాంకేతిక సమస్యలను అధిగమించే వ్యూహ ప్రణాళిక సిద్ధం చేశారు. స్వయంగా ఆయనే దగ్గరుండి అంతా పర్యవేక్షించారు. VIDEO | Union Railway Minister Ashwini Vaishnaw inspects the restoration work at the triple train accident site in Odisha’s Balasore. pic.twitter.com/U7Xno9BDpt — Press Trust of India (@PTI_News) June 4, 2023 ⛑️ 2, 300 మంది సిబ్బంది.. రైల్వే శాఖ నుంచి ఎనిమిది బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రతి రెండు బృందాలను సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు వేర్వేరుగా పర్యవేక్షించారు. ఆ సీనియర్ సెక్షన్ ఇంజనీర్లపై డివిజనల్ రైల్వే మేనేజర్, జనరల్ మేనేజర్ పర్యవేక్షణ కొనసాగింది. వారిని రైల్వే బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. #WATCH | Odisha: Union Railway Minister Ashwini Vaishnaw takes stock of the restoration work that is underway overnight at the site where #Balasoretrainaccident took place pic.twitter.com/TkulNKv3H7 — ANI (@ANI) June 3, 2023 ⛑️ బాధితులను వేగంగా ఆసుపత్రులకు తరలించడం, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూసేందుకు కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాలు ఇచ్చారు. రైల్వే బోర్డు చైర్మన్ ను కటక్ హాస్పిటల్ కు, డైరెక్టర్ జనరల్ హెల్త్ ను భువనేశ్వర్ హాస్పిటల్ కు పంపించారు. ⛑️ నాలుగు కెమెరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందించారు. ప్రమాద స్థలంలో సహాయక కార్యక్రమాల తీరును ఆ కెమెరాల సాయంతో సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పురోగతిని మంత్రికి అందించారు. సాధ్యమైనంత మేర మరణాలను తగ్గించడం, ! బాధితులకు మెరుగైన చికిత్స అందించడం, వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టడం.. ⛑️ ఇవే లక్ష్యాలుగా ఆయన ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అలా 51 గంటల్లోనే మంత్రి అశ్విని వైష్ణవ్ నాయకత్వంలో రైలు సేవలను పునరుద్ధరించగలిగారు. ఈ నెల 2న రాత్రి ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ 130 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో మెయిల్ లైన్ లో వెళుతున్న యశ్వంత్ పూర్ హౌరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ బోగీలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికి 288 మంది మరణించారు. -
Odisha Train Tragedy:ఖాళీ చేతులతో 88 మందిని రక్షించి..
ఒడిశా:ఎదో బాంబు పేలిన శబ్దం. వచ్చి చూస్తే.. ఘోర రైలు ప్రమాదం. ఎక్కడ చూసినా అరుపులు, మూలుగులు, రక్తం, చెదిరిపడిన శరీర భాగాలు అన్నీ ఒళ్లు జలదరించే దృశ్యాలే. వాటన్నింటినీ దాటుకుని దాదాపు 88 మంది ప్రాణాలను కాపాడారు ఆ ఇద్దరు యువకులు. రెస్క్యూ పరికరాలు ఏం లేకున్నా.. పడిపోయిన బోగీల్లోకి ధైర్యంగా వెళ్లి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని బయటికి తీశారు. గ్రామస్థుల సహకారంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ యువకులే దీపక్ రంజన్, శుభంకర్ జెనాలు. రెస్క్యూ టీంలు రాకముందే ప్రమాదంలో సహాయక చర్యలు మొదలుపెట్టారు. అంతా అల్లకల్లోలం.. దీపక్ రంజన బెహ్రా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. స్థానిక పిల్లలతో కలిసి మైదానంలో ఆటలాడుతున్నారు. ఆ సమయంలో ఓ పెద్ద శబ్దం వినిపించింది. వెళ్లి చూడగా.. ఘోర రైలు ప్రమాదం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారంతా కలిసి సహాయ చర్యలు మొదలుపెట్టారు. రాత్రి తొమ్మిదింటికి రెస్క్యూ బృందాలు వచ్చేవరకు అన్నీ తామే అయి చూసుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి నీళ్లు, ఆహారం పంచిపెట్టారు.'బోగీల వద్దకు మేము వెళ్లేసరికి అల్లకల్లోలంగా ఉంది. చీకటిగా ఉన్న బోగీల్లోకి వెళ్లి చాలామందిని బయటికి లాగాము. బోగీల కిందపడి కొంతమంది విపరీతంగా అరుస్తున్నారు' అని చెప్పారు. కళ్లలో మెదులుతున్నాయి.. 'గాయపడ్డవారికి మొదటి గంట చాలా కీలకం. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళితే బతికే అవకాశం ఉంటుంది. మేమంతా కలిసి మా దగ్గర ఉన్న వాహనాలలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించాము. గంట తర్వాత అంబులెన్సులు వచ్చాయి. రెస్క్యూ టీంలు వచ్చే సమయానికే మేము చాలా మందిని రక్షించాము' అని దీపక్ తెలిపారు. 'మేము బోగి లోపలికి వెళ్లేసరికి ఓ గర్భవతి అరుస్తూ కనిపించింది. ఆమెను మేము బయటికి తీసుకురాగలిగాము. కానీ బోగీల లోపలే ఉన్న తన ఇద్దరు కుమారులను రక్షించమని ఆవిడ అడిగిన తీరు ఇంకా కళ్లలో మొదలుతోంది. ఆ భయానక దృశ్యాలు ఇంకా మా మనసును వెంటాడుతున్నాయి.' అని శుభంకర్ చెప్పారు. ఇదీ చదవండి:ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్ చివరి మాటలు.. -
నెల్లూరు: పెన్నా నదిలో చిక్కుకున్న ఐదుగురు
నెల్లూరు: పెన్నా నదిలో శనివారం ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నది మధ్యలో ఇసుకదిబ్బపై వాళ్లు ఉండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సాక్షి టీవీ సమాచారంతో స్పందించిన అధికారులు .. పెన్నా బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. తహసీల్దార్‌తో పాటు పోలీసులు కూడా వచ్చారు. చిక్కుకున్న వాళ్లను మత్యకారులుగా భావిస్తున్నారు. బోట్ ద్వారా వాళ్లను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమశిల నుంచి పెన్నాకు నీటిని విడుదల చేయటంతోనే వాళ్లు అలా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు తమ హెచ్చరికలు పట్టించుకోకుండా వాళ్లు నదిలోకి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో వరదల్లో బస్సు.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!
దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో, సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. గ్రామాలు, నగరాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో వాహన ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అయితే, మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, షాజాపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శనివారం 24 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. రోడ్డు మీద వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా బస్సు డ్రైవర్ ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకుపోవడంతో విద్యార్థులు భయంతో కేకలు వేశారు. A school bus got stuck in a drain of water near Bikalkhedi village of Shajapur district, more than 24 school children were in the bus, the villagers present on the spot showed agility and pulled the bus out of the water by tying a rope with the help of a tractor.#madhyapradesh pic.twitter.com/ZvfnKVrBLG — Siraj Noorani (@sirajnoorani) July 23, 2022 ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఓ ట్రాక్టర్ సాయంతో బస్సును వరదలో నుంచి బయటకు తీశారు. 24 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. పిల్లలందరూ క్షేమంగా బయటపడటంతో వారి పేరెంట్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. #MadhyaPradesh | School Bus With Over 2 Dozen Children Stuck In Drain Amid Heavy Rain, Pulled Out https://t.co/PTKiaw2fSF pic.twitter.com/56dWF8bFPq — NDTV (@ndtv) July 23, 2022 ఇది కూడా చదవండి: చేపకు వేలంలో రూ. 3 లక్షలు.. స్పెషల్ తెలిస్తే షాక్ అవుతారు -
భారీ వర్షం: శభాష్ పోలీస్..
సాక్షి, హైదరాబాద్: ఆపద వచ్చిందంటే చాలు మేమున్నామంటూ ముందుండే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఈసారి కూడా ప్రజలకు బాసటగా నిలిచారు. భారీ వర్షం వల్ల అతలాకుతలమైన ప్రాంతాల్లో ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించారు. రహదారులకు అడ్డుగా పడి ఉన్న చెట్లను తొలగించారు. ప్రమాదానికి అవకాశమున్న మ్యాన్‌హోల్స్‌ను ఓపెన్ చేసి నీటిని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. నేషనల్ డిజాస్టర్ టీమ్(ఎన్డీఆర్ఎఫ్), డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్(డీఆర్ఎఫ్), ఆర్మీ, అక్టోపస్ బలగాలతో కలిసి వరదల్లో చిక్కుకున్న పిల్లలు, పెద్దలు, వృద్ధులను రక్షించారు. ఆకలితో ఇబ్బందిపడుతున్న వారికి ఆహర పొట్లాలు అందించారు. దాదాపు నాలుగు రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా పోలీసు కమిషనర్ల నుంచి హోంగార్డుల వరకు అలుపెరగని సేవలందించారు. వరదల వల్ల ట్రాఫిక్ ఏర్పడిన ప్రాంతంలో క్లియర్ చేసి ముందుకు వెళ్లేలా చూశారు. ప్రస్తుతం వర్షం తగ్గినా లోతట్టు ప్రాంత ప్రజలను ఇబ్బందుల నుంచి బయటపడేయడంపై దృష్టి సారించి పనిచేస్తున్నారు. నిత్యావసరాలు తీసుకువస్తున్న రాచకొండ పోలీసులు చైతన్యపురిలోని రీబాక్ షోరూమ్ సమీపంలో ఇళ్లల్లోకి వరదనీరు వచ్చి చేరడంతో ఆయా నివాసాల్లో ఉన్న పది మందిని సంరక్షించారు. మల్కాజ్గిరి ఠాణా పరిధిలోని షిర్డీనగర్, పటేల్ నగర్, వసంతపురి కాలనీలో వరదల్లో చిక్కుకున్న 30 మంది కుటుంబాలను ఇన్స్పెక్టర్ బి.జగదీశ్వర్‌రావు నేతృత్వంలోని సిబ్బంది కాపాడారు. ఉప్పల్ ఠాణా పరిధిలోని కావేరినగర్‌లో వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు నుంచి 33 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. జలమయమైన పెద్దఅంబర్‌పేట రహదారిలో చిక్కుకున్న లారీ నుంచి డ్రైవర్ రాంరెడ్డిని హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ సురేంద్ర నేతృత్వంలోని బృందం ప్రాణాలనుకా పాడింది. లోతట్టు ప్రాంతమైన సరూర్‌నగర్ వివేకానంద కాలనీలో పాలు, నీరు, టిఫిన్, పండ్లను ట్రాఫిక్ పోలీసు రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ రాచమల్లు నేతృత్వంలోని బృందం సరఫరా చేసింది. రాబిన్ హుడ్‌తో కలిసి సైబరాబాద్ పోలీసులు వరద లోతట్టు ప్రాంతాల్లో ఆçహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలోని శక్తి బ్రిడ్జి వద్ద చిక్కుకున్న మృతదేహన్ని జేసీబీద్వారా బయటకు తీసుకొచ్చేలా చూసిన కానిస్టేబుల్ సురేందర్‌ను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సన్మానించారు. గగన్‌పహాడ్‌లో కోతకు గురైన రహదారిని, మైలార్‌దేవ్‌పల్లిలోని పల్లెచెరువు, ప్రాంతాల్లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ శుక్రవారం పర్యటించారు. ఘట్కేసర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లే దారిలో నిండుకుండలా మారిన కుంటను సీపీ మహేష్‌భగవత్ పరిశీలించి సహాయ చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలో ఆగని భూ ప్రకంపనలు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ టీఎన్జీఒ కాలనీలో భూ ప్రకంపనల భయం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం కూడా భూమిలోంచి శబ్దాలు వచ్చాయి. గడిచిన మూడు రోజుల నుండి భూమిలోంచి శబ్దాలు వస్తుండటంతో స్థానికుల భయాందోళనలకు గురవుతున్నారు. ప్రకంపనల తీవ్రతను తెలుసుకునేందుకు ఎన్జీఆర్ఐ ప్రతినిధులు శుక్రవారం కాలనీలో రెండు భూకంప లేఖినిలను అమర్చారు. ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనగేష్ సాక్షితో మాట్లాడుతూ భూమిలో వస్తున్న శబ్దాల వల్ల భయపడాల్సిన అవసరం లేదని రిక్టర్ స్కేల్‌పై 0.5గా నమోదవుతున్నాయన్నారు. భూకంప లేఖినిలతో పరిస్థితిని మరిన్ని రోజులు పరిశీలిస్తామని చెప్పారు. -
బోరు బావిలో బాలుడు
వెల్లోర్(తమిళనాడు): రెండున్నరేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అతడిని ప్రాణాలతో రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, సంబంధిత సిబ్బంది కఠోర శ్రమపడుతున్నారు. వెల్లోర్ జిల్లాలోని కూరంపడి అనే గ్రామంలో 250 మీటర్ల లోతుతో బోరు బావి వేసి అది ఎండిపోవడంతో ఎలాంటి మూతవేయకుండా వదిలేశారు. ఆదివారం ఉదయం ఆడుకుంటూ వెళ్లిన రెండున్నారేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. 20 మీటర్ల లోతులో బాలుడు ఇరుక్కు పోయినట్లు గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అతడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.