మేడ్చల్:
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఫిర్జాదిగూడాలోని కార్ మెకానిక్ షెడ్‌లో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న ఎయిర్ కూలర్ల దుకాణానికి అగ్నికీలలు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు ఇది గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తినష్టం జరిగనట్లు సమాచారం.
మేడిపల్లిలో అగ్నిప్రమాదం
Published Sun, Feb 26 2017 9:38 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement