మత్స్య క్షేత్రం అభివృద్ధికి చర్యలు
మత్స్య క్షేత్రం అభివృద్ధికి చర్యలు
Published Sun, Sep 11 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
కడియం : స్థానిక మంచినీటి చేపపిల్లల ఉత్పత్తి క్షేత్రం అభివృద్ధికి ప్రతిపాదనలు చేస్తున్నట్టు మత్స్య శాఖ డీడీ డాక్టర్ అంజలి చెప్పారు. స్టేట్ ఇ¯Œæస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(ఎస్‌ఐఎఫ్‌టీ) సాంకేతిక బృందంతో కలిసి ఆమె ఆదివారం మత్స్య క్షేత్రాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఏడు రేరింగ్‌ఫారమ్స్, సొసైటీలు, రిజర్వాయర్లు, కేప్టివ్ నర్సరీలతో పాటు ఇతర జిల్లాలకు కూడా కడియం నుంచి చేపపిల్లలు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 18 కోట్ల పిల్లల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు 5.32 కోట్ల చేప పిల్లలను ఈ క్షేత్రం ఉత్పత్తి చేసిందని చెప్పారు. వేలంక, చండ్రేడుల్లో కేప్టివ్ నర్సరీలు ఏర్పాటైనట్టు తెలిపారు. ఏలేశ్వరంలోని తిమ్మరాజు చెరువును కూడా కేప్టివ్ నర్సరీగా అభివృద్ధి చేయమని అక్కడి మత్స్యకార సొసైటీలు కోరుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్షేత్రంలో నలుగురు ఫిషర్‌మెన్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఫిషరీస్ రాజమహేంద్రవరం ఏడీ కె.రామతీర్ధం, కడియం ఎఫ్‌డీఓ ప్రకాశరావు పాల్గొన్నారు.
Advertisement