హాస్టళ్ల తనిఖీకి ప్రత్యేకాధికారులు | Ðfor hostels search special officers | Sakshi
Sakshi News home page

హాస్టళ్ల తనిఖీకి ప్రత్యేకాధికారులు

Published Mon, Dec 5 2016 9:48 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

హాస్టళ్ల తనిఖీకి ప్రత్యేకాధికారులు

హాస్టళ్ల తనిఖీకి ప్రత్యేకాధికారులు

ఏలూరు (మెట్రో) : జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, హాస్టల్స్‌ను మరింత పటిష్టవంతంగా నిర్వహించేందుకు 47 మంది ప్రత్యేక అధికారులను నియమించామని, ప్రతి అధికారి హాస్టల్‌లో రాత్రిపూట మకాం చేసి విద్యార్థులతో మమేకం కావాలని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం జిల్లాస్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్‌ భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో 173 ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌ ఉన్నాయని, ఈ హాస్టల్స్‌లో ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులకు సక్రమంగా భోజనాలు పెడుతున్నారా? హాస్టల్స్‌లో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా? విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని నియమించామని, ఆ అధికారులంతా ప్రతివారం హాస్టల్స్‌ను తనిఖీ చేయాలని కలెక్టర్‌ చెప్పారు. క్రమశిక్షణతో విద్యాబోధన సాగిస్తే హాస్టల్‌లో చదివే విద్యార్థులు కూడా కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా మంచి ఫలితాలు సాధించగలుగుతారని కలెక్టర్‌ చెప్పారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 430 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఈ కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని కలెక్టర్‌ చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు, ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ విధానం మరింత పటిష్టవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, జెడ్పీ సీఈవో సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ మాణిక్యం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మల, డ్వామా పీడీ ఎం.వెంకట రమణ, హౌసింగ్‌ పీడీ ఇ.శ్రీనివాస్, డీపీవో సుధాకర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు
 
 
 

Advertisement
Advertisement