‘పరిమితి’ దాటింది.. ప్రమాదం జరిగింది
- నలుగురు ప్రయాణించడంతో అదుపు తప్పిన బైక్
- సూచిక బోర్డును ఢీకొనడంతో గాయాలపాలైన వైనం
గ్రామ శివారులోని మూలమలుపు వద్దకు చేరుకోగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న సూచిక బోర్డును ఢీకొంది. దీంతో నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. శేఖర్ ఎడమ మోకాలి కింది భాగం పూర్తిగా విరగడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు వీరిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు బస్సులు, రైళ్లలో ప్రయాణించడం శ్రేయస్కరం.