గుంపులో చిక్కుకుపోయారా? మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి
రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదాలు పొంచివుంటాయి. అనియంత్రిత జనసమూహం కారణంగా సంతోషకరమైన వాతావరణం కూడా కొద్ది క్షణాల్లోనే భయానకంగా మారిపోతుంటుంది. ఇటువంటి ఘటనలు అప్పుడప్పుడూ ఊహించని విధంగా సంభవిస్తుంటాయి.ముందుగానే పసిగట్టవచ్చుఇటువంటి సందర్భాల్లో గుంపులో చిక్కుకున్నప్పుడు సురక్షితంగా బయటపడటం ప్రధానం. ఇలాంటి భారీ కార్యక్రమాల నిర్వహణ సందర్బంలో ప్రజల భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులపై ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే పసిగట్టడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంగ్లాండ్‌లోని సఫోల్క్ విశ్వవిద్యాలయానికి చెందిన క్రౌడ్ సైన్స్ ప్రొఫెసర్ జి. కేథ్ స్టిల్ మాట్లాడుతూ జనసమూహం చాలా నెమ్మదిగా ముందుకు కదులుతుంటే, రద్దీ పెరుగుతోందని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ఇటువంటి సందర్భాల్లో జనసమూహం నుంచి వచ్చే శబ్దాన్ని వినడం చాలా ముఖ్యం. జనం అసౌకర్యంగా, బాధతో కేకలు వేస్తున్నట్లు గుర్తిస్తే, అది పరిస్థితులు అదుపు తప్పవచ్చనడానికి సంకేతమని కేథ్ తెలిపారు. అటువంటి పరిస్థితిలో బయటపడే ప్రయత్నం చేయాలని కేథ్ సూచించారు.పరిస్థితి నియంత్రణలో లేనప్పుడునార్తంబ్రియా విశ్వవిద్యాలయానికి చెందిన క్రౌడ్ నిపుణుడు, ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొఫెసర్ మార్టిన్ అమోస్ మాట్లాడుతూ జనసమూహం చదరపు మీటరుకు ఐదుగురి వరకూ చేరుకుంటే, పరిస్థితి ప్రమాదకరంమని గుర్తించాలన్నారు. అయితే జనసమూహం సాంద్రతను అంచనా వేయడం కష్టం. అందుకే మీకు జనంలో బాగా ఇరుక్కుపోయానని అనిపించినప్పుడు వెంటనే బయటపడే ప్రయత్నం చేయాలని సూచించారు. అయితే పరిస్థిని మీ నియంత్రణలో లేనప్పడు మీరు ముందుకు తోసుకుంటూ వెళ్లకుండా, జనసమూహం మిమ్మల్ని కదిలిస్తున్న విధంగా ముందుకు కదలాలని ఆమోస్ సూచించారు.చేతులను మీ ఛాతీకి రక్షణగా..ఒకవేళ జనసమూహం కదలడం ఆగిపోయినప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడటం, మీ చేతులను మీ ఛాతీకి రక్షణగా ఉంచుకోవడం చేయాలి. అయితే అటువంటి పరిస్థితిలో ఎప్పుడూ జనసమూహానికి వ్యతిరేకంగా వెళ్లకూడదని అమోస్ సూచించారు. లాస్ ఏంజిల్స్ క్రౌడ్ సేఫ్టీ అడ్వైజరీ సర్వీస్ నిర్వహణ వ్యూహకర్త పాల్ వెర్డెమియర్ మాట్లాడుతూ పిల్లలను రద్దీగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లకపోవడమే ఉత్తమమన్నారు. అలాగే రద్దీలో మీ ఫోన్ లేదా ఏదైనా పడిపోయి ఉంటే, దానిని వదిలివేయాలని, కాదని దానిని తీసుకునే ప్రయత్నం చేస్తే ప్రమాదంలో పడతారని ఆయన హెచ్చరించారు.కింద పడిపోయినప్పుడు..రద్దీ సమయంలో ఊపిరి ఆడకపోవడమే మరణానికి కారణమవుతుంది. జనంలో ఇరుక్కుపోయినప్పుడు మీ ఊపిరితిత్తులు శ్వాస తీసుకునేందుకు అనువుగా విస్తరించడానికి అవకాశం తగ్గుతుంది. శ్వాసకోశ అవరోధం ఏర్పడుతుంది. గుంపులో ఎవరైనా కింద పడిపోయినప్పుడు, అతనిపై ఇతరులు పడిపోతారు. అప్పడు కిందనున్న వ్యక్తి ఊపిరి తీసుకోలేక ప్రాణాపాయానికి చేరుకుంటాడు. ఈ సమయంలో ఊపిరితిత్తులు, గుండె దెబ్బతినడంలాంటివి జరుగుతాయి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నాణ్యత కలిగిన బూట్లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ధరించనప్పుడు గుంపులో కూడా బలంగా నిలబడగలుగుతామని వారు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండటమే దీనికి ఏకైక పరిష్కారం అని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు