5న పీజీ స్పాట్‌ అడ్మిషన్‌లు | from 5th onwords Pg spot admissions | Sakshi
Sakshi News home page

5న పీజీ స్పాట్‌ అడ్మిషన్‌లు

Published Mon, Oct 3 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

from 5th onwords Pg spot admissions

నల్లగొండ టూటౌన్‌: జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఈనెల 5న పీజీలో స్పాట్‌ అడ్మిషన్‌లు ఇవ్వనున్నట్లు ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్‌ రావుల నాగేందర్‌రెడ్డి, పీజీ కో ఆర్డినేటర్‌ పి. రవికుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా సబ్జెక్ట్‌ల్లో ఖాళీలను రిజర్వేషన్‌ ప్రకారం భర్తీ చేయబడునని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్స్, డిగ్రీ టీసీ, యూనివర్సిటీ నిర్ణయించిన కోర్సు ఫీజుతో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కోరారు. స్పాట్‌ అడ్మిషన్‌లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని, మొత్తం ఫీజును అడ్మిషన్‌ సమయంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ –07, ఎమ్మెస్సీ జువాలజీ –07, ఎమ్‌కాం –06, ఎమ్‌ఏ ఎకనామిక్స్‌ –10, ఎంఏ తెలుగు – 11 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement