onwords
-
5న పీజీ స్పాట్ అడ్మిషన్లు
నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఈనెల 5న పీజీలో స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ రావుల నాగేందర్‌రెడ్డి, పీజీ కో ఆర్డినేటర్ పి. రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా సబ్జెక్ట్‌ల్లో ఖాళీలను రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయబడునని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, డిగ్రీ టీసీ, యూనివర్సిటీ నిర్ణయించిన కోర్సు ఫీజుతో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కోరారు. స్పాట్ అడ్మిషన్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని, మొత్తం ఫీజును అడ్మిషన్ సమయంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ –07, ఎమ్మెస్సీ జువాలజీ –07, ఎమ్‌కాం –06, ఎమ్ఏ ఎకనామిక్స్ –10, ఎంఏ తెలుగు – 11 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. -

30న ఎంగిలి పువ్వు బతుకమ్మ
నల్లగొండ కల్చరల్: ఈ నెల 30న ఎంగిలి పువ్వు బతుకమ్మ, అక్టోబరు 8న∙సద్దుల బతుకమ్మ, 9న దుర్గాష్టమి, 10న మహార్నవమి, 11న విజయదశమి పండుగలు జరుపుకోవాలని కోరారు. జిల్లా అర్చక వైదిక బ్రాహ్మణ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పానగల్లు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ పండుగలను నిర్వహించాల్సిన తేదీలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అక్టోబరు 10 వరకు గురుమౌడ్యమి ఉన్నందున ఎటువంటి శుభకార్యములు జరుపుకోవడానికి అవకాశం లేదని తెలిపారు. ఈ సమావేశంలో అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, వైదిక బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు గుదె లక్ష్మీనర్సయ్య శర్మ, అర్చక సంఘం గౌరవ అధ్యక్షులు దౌలతాబాదు వాసుదేవశర్మ, కోడుగంటి వెంకటరమణ శర్మ, కందాళ శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
23 నుంచి స్కూల్ గేమ్స్ క్రీడాపోటీలు
నల్లగొండ టూటౌన్ : ఈ నెల 23 నుంచి స్కూల్‌గేమ్స్ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ వై.చంద్రమోహన్, ఎస్జీఎఫ్ కార్యదర్శి పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 14, 17 సంవత్సరాల క్రీడాకారులకు క్రికెట్, యోగా సెలక్షన్లు, హ్యాండ్‌బాల్, ఖో–ఖో, కబడ్డీ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. – 23న నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో 17 సంవత్సరాల బాలురకు క్రికెట్ పోటీలు – 23న 14, 17 సంవత్సరాల విద్యార్థులకు నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో యోగా సెలక్షన్స్ పోటీలు – 24న నల్లగొండలో అవుట్డోర్ స్టేడియంలో 14, 17 సంవత్సరాల బాలబాలికలకు హ్యాండ్ బాల్ సెలక్షన్స్ – 25, 26న సూర్యాపేటలోని లైలా కాలేజీలో 14, 17 సంవత్సరాల వారికి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు – 26న హుజూర్‌నగర్‌లో ప్రభుత్వ హైస్కూల్లో 14 సంవత్సరాల బాలబాలికలకు ఖో–ఖో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
నేటినుంచి వాలీబాల్ టోర్నీ
ముకుందాపురంలో పోటీలు –ఐదు yì విజన్ల నుంచి 20 టీంలు నిడమనూరు : మండలంలోని ముకుందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. 2011లో ఇదే మైదానంలో జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. జిల్లాలోని ఐదు డివిజన్లకు చెందిన 20టీంలు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ప్రారంభించనున్న జానా అండర్–14,అండర్–17 బాలబాలికల వాలీబాల్ పోటీలను శనివారం టీ æసీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రారంభించనున్నట్లు ఎంఈఓ బాలునాయక్, వ్యాయామ ఉపాద్యాయుడు సత్యనారాయణలు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 5డివిజన్లకు చెందిన 300మంది బాలబాలికలు పోటీలలో పాల్గొంటారని తెలిపారు. -
9 నుంచి రాష్ట్ర స్థాయి ప్రో కబడ్డీ పోటీలు
చిలుకూరు : చిలుకూరు ప్రో కబడ్డీ యూత్ ఆధ్వర్యంలో వచ్చే నెల 9 నుంచి∙11వ తేదీ వరకు మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రామీణ ప్రో కబడ్డీ్డ పోటీలను చిలుకూరులో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షేక్ పాషా, అమరగాని లింగరాజు, యూసఫ్, షేక్ నాగులమీరా, అమరగాని నవీన్ తెలిపారు. పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం చిలుకూరులో ఆవిష్కరించారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ. 10,016, ద్వితీయ రూ. 8016, తృతీయ రూ. 6016, చతుర్ద రూ. 4016, ఐదో బహుమతి రూ. 3016, ఆరో బహుమతి రూ. 2016తో పాటు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 95026 45066, 90632 38305 నెంబర్లలో సంప్రదించి జట్టు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.