9 నుంచి రాష్ట్ర స్థాయి ప్రో కబడ్డీ పోటీలు | from 9th onwords pro kabaddi | Sakshi
Sakshi News home page

9 నుంచి రాష్ట్ర స్థాయి ప్రో కబడ్డీ పోటీలు

Published Fri, Aug 26 2016 1:59 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

9 నుంచి రాష్ట్ర స్థాయి ప్రో కబడ్డీ పోటీలు

9 నుంచి రాష్ట్ర స్థాయి ప్రో కబడ్డీ పోటీలు

చిలుకూరు : చిలుకూరు ప్రో కబడ్డీ యూత్‌ ఆధ్వర్యంలో వచ్చే నెల 9 నుంచి∙11వ తేదీ వరకు మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రామీణ ప్రో కబడ్డీ్డ పోటీలను చిలుకూరులో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షేక్‌ పాషా, అమరగాని లింగరాజు, యూసఫ్,  షేక్‌ నాగులమీరా, అమరగాని నవీన్‌ తెలిపారు. పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం చిలుకూరులో ఆవిష్కరించారు.  గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ. 10,016, ద్వితీయ రూ. 8016, తృతీయ రూ. 6016, చతుర్ద రూ. 4016, ఐదో బహుమతి రూ. 3016, ఆరో బహుమతి రూ. 2016తో పాటు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.   ఆసక్తి గల క్రీడాకారులు 95026 45066, 90632 38305 నెంబర్లలో సంప్రదించి జట్టు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement