గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 45–38తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. గుజరాత్ తరఫున డాంగ్ లీ 10, రోహిత్ గులియా 7 రైడ్ పాయింట్లతో సత్తా చాటగా... ట్యాక్లింగ్‌లో పర్వేశ్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యూపీ యోధా, బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 30–30తో ‘డ్రా’గా ముగిసింది. లీగ్‌లో నేడు విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో హరియాణా స్టీలర్స్, యూపీ యోధాతో తెలుగు టైటాన్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment