శాంతియుతంగా గణేశ్ ఉత్సవాలు
Published Thu, Sep 8 2016 12:43 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
జడ్చర్ల : జడ్చర్లలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో ఈనెల 10న నిర్వహించే నిమ్మజ్జనోత్సవ ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. చిన్న విగ్రహాలను స్థానికంగా ఉన్న నీటి కొలనులో నిమజ్జనం చేసేలా స్థల పరిశీలన చేసి గురువారం నిర్ణయించనున్నట్లు తెలిపారు.్చ ఇక పెద్ద విగ్రహాలను బీచుపల్లి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో నిమజ్జనం శాంతియుతంగా కొనసాగేందుకు అందరు సహకరించాలన్నారు. నిమజ్జనోత్సవం్చ శనివారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. నిమజ్జనయాత్ర రూట్‌మ్యాప్ తయారు చేసి విద్యుత్‌లైన్‌లు,తదితర రోడ్డు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నిమజ్జనోత్సవ ప్రదేశంలో బారీకేడ్లు, క్రేన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సమావేశంలో నగర పంచాయతీ కమిషనర్ గంగారాం, ట్రాన్స్‌కో ఏఈ నిరంజన్‌దాస్, వైస్ ఎంపీపీ రాములు, బీజేవైం జిల్లా అధ్యక్షుడు రాంమ్మోహన్, ఎస్‌ఐ జములప్ప, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నందకిశోర్‌గౌడ్, వీహెచ్‌పీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement