peacefull
-
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై భద్రతా మండలి ఏకగ్రీవ ప్రకటన
ఐరాస/జపోరిజియా(ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధంపై, ఫలితంగా ఆ దేశంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. సమస్యకు తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాలంటూ యుద్ధంపై తొలిసారిగా ఏకగ్రీవ ప్రకటన చేసింది. ఈ దిశగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు 15 మంది సభ్యుల సమితి పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే ప్రకటనలో యుద్ధం అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. రక్తపాతం ద్వారా ఏ పరిష్కారమూ దొరకదని, దౌత్యం, చర్చల ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలన్నది ముందునుంచీ భారత వైఖరి అని ఐరాసలో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ ప్రతీక్ మాథుర్ పునరుద్ఘాటించారు. మే 9 విక్టరీ డే సమీపిస్తున్న నేపథ్యంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతోంది. రెండో అతి పెద్ద నగరం ఖర్కీవ్‌ను రక్షణపరంగా దుర్భేద్యంగా మార్చేసింది. ఈ నగరాన్ని లక్ష్యం చేసుకుని రష్యా ఉన్నట్టుండి దాడులను తీవ్రతరం చేసింది. మారియుపోల్‌లో అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీపైనా దాడులను భారీగా పెంచింది. శుక్ర, శనివారాల్లో ప్లాంటు నుంచి 50 మందికి పైగా బయటపడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. తూర్పున డోన్బాస్లోనూ పోరాటం తీవ్రతరమవుతోంది. లెహాన్స్క్లో రష్యా బలగాలు బాగా చొచ్చుకెళ్లినట్టు సమాచారం. భాగస్వాములను కాపాడుకోలేని అమెరికా బలహీనత వల్లే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిందని అల్‌ఖైదా నేత అల్ జవహరీ విమర్శించారు. అమెరికా అగ్రరాజ్యం కాదు. దిగజారిపోతోంది’’ అన్నారు. రొమేనియా సాయం సూపర్: జిల్ బుఖారెస్ట్: దాదాపు 10 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులను రొమేనియా ఆదుకున్న తీరు సాటిలేనిదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ కొనియాడారు. 4 రోజుల యూరప్ పర్యటనలో ప్రస్తుతం రొమేనియాలో ఉన్న ఆమె ఆదివారం మాతృ దినోత్సవాన్ని స్లొవేనియాలో ఉక్రెయిన్ సరిహద్దుల సమీప గ్రామంలో శరణార్థులతో గడపనున్నారు. రొమేనియా అధ్యక్షుని భార్య కామెరాన్ అయోహనిస్తో జిల్ భేటీ అయ్యారు. వరల్డ్ చాంపియన్ మృతి అంతర్జాతీయ యుద్ధ క్రీడల్లో ప్రపంచ చాంపియన్, రష్యా యుద్ధ ట్యాంకుల నిపుణుడు బటో బసనోవ్ (25) ఉక్రెయిన్ యుద్ధంలో మరణించాడు. అతని యుద్ధ ట్యాంకును ఉక్రెయిన్ దళాలు పేల్చేశాయి. గతేడాది జరిగిన వరల్డ్ ట్యాంక్ బయాథ్లాన్‌లో గంటకు 50 మైళ్ల వేగంతో కూడిన లక్ష్యాలను ఒక్కటి కూడా వదలకుండా ఛేదించి బసనోవ్ రికార్డు సృష్టించాడు. యుద్ధంలో 38వ కల్నల్‌ను రష్యా డోన్బాస్లో కోల్పోయింది. మరోవైపు, రష్యా ల్యాండింగ్ షిప్‌ను టీబీ2 డ్రోన్ సాయంతో స్నేక్ ఐలాండ్‌లో ముంచేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధరించిన ఖాకీ జాకెట్ లండన్‌లో జరిగిన వేలంలో 90 వేల డాలర్ల ధర పలికింది. -
ఉక్రెయిన్-రష్యా వివాదం: సంయమనం పాటించాలని పిలుపునిచ్చిన తాలిబన్లు!
Russia Ukraine conflict through “peaceful means: అఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ మేరకు ఇరుదేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలించడమే కాక పౌరుల ప్రాణ నష్టం పై ఆందోళన వ్యక్తం చేసింది. హింసను తీవ్రతరం చేసే విధానాలను ఇరు పక్షాలు మానుకోవాలని సూచించింది. అంతేకాదు అఫ్గాన్ తటస్థ విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉందని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది నెలరోజుల క్రితం అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు ఇదే విధమైన సైనిక దాడిని ఉపసంహరించుకుని అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ఏళ్ల తర్వాత అమెరికా సైన్యం ఉపసంహరించుకోవడంతో అష్రఫ్ ఘనీ ఎన్నికైన ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 15న అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్నారు. Statement concerning crisis in #Ukraine pic.twitter.com/Ck17sMrAWy — Abdul Qahar Balkhi (@QaharBalkhi) February 25, 2022 (చదవండి: రష్యా మిలటరీ కాన్వాయ్కి అడ్డుగా నిలుచుని ఆపేందుకు యత్నం!) -
జార్ఖండ్ మూడో దశలో 62 శాతం పోలింగ్
రాంచి: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది జిల్లాల్లో 17 సీట్లకు జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 56 లక్షల మంది (62.6 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే వెల్లడించారు. వీరిలో 26 లక్షల మంది మహిళలు, 86 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాంచి, హటియా, కాంకే, బర్ఖాతా, రామ్‌గర్‌లలో సాయంత్రం 5 గంటల వరకు.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. -
ప్రశాంతంగా మూడో విడత
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గ్రామ పంచాయతీ చివరి విడత పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ము గిసింది. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధి ఎనిమిది మండలాల్లోని 148 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, 1,098 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. మొత్తం 211 పంచాయతీలకు గాను, 61 జీపీలు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఇందల్వాయి మండలంలోని రెండు జీపీలు తిర్మన్‌పల్లి, గంగారాంతండాలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించి నామినేషన్లు వేయనందున ఎన్నికలు జరుగలేదు. మిగిలిన 148 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించిన ఎన్నికల అధికార యంత్రాంగం, భోజ న విరామం అనంతరం కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించిన తర్వాత, సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టా రు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. పోలింగ్ ప్రారంభమైన ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. అత్యధికంగా 87 శాతం ఓట్లేసిన మహిళలు.. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 2.16 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1.73 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా మహిళలు 1,00,847 (87 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 72,262 (71శాతం) మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషు ల కంటే మహిళలే ఉత్సాహం గా ఓటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 35.40 శాతం పోలింగ్ జరిగింది. 11 గంటల వ రకు ఈ పోలింగ్ శాతం 59.69 శాతానికి పెరిగింది. పోలింగ్ ముగిసే సమయం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొత్తం 79.81 శాతం పోలింగ్ నమోదైందని అధికార యంత్రాంగం ప్రకటించింది. పకడ్బందీ ఏర్పాట్లు.. పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు ఓటేసేందుకు వచ్చిన వికలాంగులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీల్చైర్లు ఏర్పాటు చేశారు. తాగు నీ టి వసతి కూడా కల్పించారు. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. సిరికొండ మండలం రావుట్లలో నిజామాబాద్‌రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుమారుడు జగన్, కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. జల్లాపల్లికి పోలింగ్.. పోలింగ్ నిలిచిపోయిన కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామానికి బుధవారం పోలింగ్ నిర్వహించారు. రెండో విడతలో జరగాల్సి ఉండగా, బ్యాలెట్ పేపర్లో జరిగిన పొరపాటు కారణంగా పోలింగ్ నిలిపివేవారు. ఓటరు జాబితా నుంచి తమ ఓట్లు గల్లంతయ్యాయని ఇందల్వాయి మండలం గన్నారంలో కొందరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాక్లూర్ మండలం కేంద్రంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేసిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలన.. జిల్లాలో పోలింగ్ సరళిని కలెక్టర్ ఎంఆర్ఎం రావు కలెక్టరేట్లో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పరిశీలించారు. సమస్యాత్మక ఎనిమిది పంచాయతీల పరి«ధిలోని 25 పోలింగ్ కేంద్రాల్లో ఈ వెబ్‌క్యాస్టింగ్ ప్రక్రియను నిర్వహించారు. -
ఉపఎన్నికల్లో ఈవీఎం పంచాయితీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సోమవారం 14 చోట్ల ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో రెండు, యూపీలో ఒకటి, నాగాలాండ్‌లో ఒక పార్లమెంటు స్థానాలకు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 31న జరగనుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోందియా లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల్లో ఈవీఎంల గందరగోళంపై శివసేన, ఎన్సీపీలు మండిపడ్డాయి. 25శాతం ఈవీఎంలు సరిగా పనిచేయలేదని మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్ అన్నారు. చాలాచోట్ల వీవీపీఏటీ (ఓటు ధ్రువీకరణ యంత్రం)లు పనిచేయలేదన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంపై విచారణ జరిపించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. భండారా–గోందియాలో 40%, పాల్ఘర్లో 46% ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్ లోక్‌సభ స్థానంలో 70 శాతం పోలింగ్ నమోదైంది. కైరానాలో హైరానా! అటు యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం, నూర్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంల విషయంలో అధికార, విపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఎన్నికల సంఘం వేరే ఈవీఎంలను ఏర్పాటుచేసింది. వీలుకాని చోట్ల రీపోలింగ్ జరపనుంది. కాగా, ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందని ఎస్పీ, బీఎస్పీలు ఆరోపించాయి. పలుచోట్ల ఈవీఎంలు చాలాసేపు పనిచేయకపోవడంపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కైరానాలో 54.17% పోలింగ్ నమోదైంది. కర్ణాటకలోని రాజరాజేశ్వర నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 54 శాతం పోలింగ్ నమోదైంది. కొన్నిచోట్ల సమస్య ఉత్పన్నమైన మాట వాస్తవమేనని.. కానీ విపక్షాలు దీన్ని ఎక్కువచేసి చూపిస్తున్నాయని ఈసీ పేర్కొంది. చాలాచోట్ల ముందుగానే అదనపు ఈవీఎంలు ఏర్పాటుచేశామని తెలిపింది. ఉప ఎన్నికలు జరిగిన లోక్‌సభ స్థానాలు కైరానా (యూపీ) 2014 ఎన్నికల్లో విజేత: హుకుమ్‌సింగ్ (బీజేపీ) ప్రత్యర్థి: నహీద్ హసన్ (ఎస్పీ) మెజారిటీ: 2,36,828 పాల్ఘర్ (మహారాష్ట్ర) 2014లో విజేత: చింతామన్ వానగా (బీజేపీ) ప్రత్యర్థి: బలిరాం (బహుజన్ వికాస్ అఘాడీ) మెజారిటీ: 2,39,520 భండారా–గోందియా (మహారాష్ట్ర) 2014లో విజేత: నానాభావ్ పటోలే (బీజేపీ) ప్రత్యర్థి: ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ) మెజారిటీ: 1,49,254 నాగాలాండ్ 2014లో విజేత: – నీఫియూ రియో (ఎన్పీఎఫ్) ప్రత్యర్థి: కేవీ పుసా (కాంగ్రెస్) మెజారిటీ: 4,00,225 -
పరీక్ష ప్రశాంతం
కాకినాడ సిటీ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిష¯ŒS (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ రాత పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుంచి ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్లను ఆయా పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రతతో తరలించారు. సమన్వయ అధికారిగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఏపీపీఎస్సీ చైర్మ¯ŒS ఉదయభాస్కర్ కాకినాడలోని ఆదిత్య, ప్రగతి కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరిగిన ఈ పరీక్షలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురవకుండా జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం డివిజ¯ŒSల పరిధిలోని మండల, మున్సిపల్ ప్రాంతాల్లో 135 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల వివరాలు తెలియజేసేందుకు ప్రధాన సెంటర్లలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా నిర్దేశించిన సమయానికే ఆయా కేంద్రాలకు చేరుకోగలిగారు. 43 మంది లైజనింగ్ అధికారులు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా 64,107 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 48,239 మంది హాజరయ్యారు. 15,868 మంది గైర్హాజరయ్యారు. హాజరు 75 శాతం నమోదైంది. పరీక్ష ముగిసిన అనంతరం ఆయా కేంద్రాల నుంచి ఆన్సర్ షీట్లను పటిష్ట భద్రత మధ్య కలెక్టరేట్‌కు తీసుకువచ్చారు. వాటన్నింటినీ ప్రత్యేక బస్సులో ఏపీపీఎస్సీ అధికారులు సాయంత్రం హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. -
శాంతియుతంగా గణేశ్ ఉత్సవాలు
జడ్చర్ల : జడ్చర్లలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో ఈనెల 10న నిర్వహించే నిమ్మజ్జనోత్సవ ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. చిన్న విగ్రహాలను స్థానికంగా ఉన్న నీటి కొలనులో నిమజ్జనం చేసేలా స్థల పరిశీలన చేసి గురువారం నిర్ణయించనున్నట్లు తెలిపారు.్చ ఇక పెద్ద విగ్రహాలను బీచుపల్లి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో నిమజ్జనం శాంతియుతంగా కొనసాగేందుకు అందరు సహకరించాలన్నారు. నిమజ్జనోత్సవం్చ శనివారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. నిమజ్జనయాత్ర రూట్‌మ్యాప్ తయారు చేసి విద్యుత్లైన్లు,తదితర రోడ్డు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నిమజ్జనోత్సవ ప్రదేశంలో బారీకేడ్లు, క్రేన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సమావేశంలో నగర పంచాయతీ కమిషనర్ గంగారాం, ట్రాన్స్‌కో ఏఈ నిరంజన్‌దాస్, వైస్ ఎంపీపీ రాములు, బీజేవైం జిల్లా అధ్యక్షుడు రాంమ్మోహన్, ఎస్ఐ జములప్ప, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నందకిశోర్‌గౌడ్, వీహెచ్‌పీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.