పరీక్ష ప్రశాంతం
పరీక్ష ప్రశాంతం
Published Sun, Feb 26 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM
కాకినాడ సిటీ :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిష¯ŒS (ఏపీపీఎస్‌సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ రాత పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుంచి ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్లను ఆయా పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రతతో తరలించారు. సమన్వయ అధికారిగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఏపీపీఎస్‌సీ చైర్మ¯ŒS ఉదయభాస్కర్ కాకినాడలోని ఆదిత్య, ప్రగతి కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరిగిన ఈ పరీక్షలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురవకుండా జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం డివిజ¯ŒSల పరిధిలోని మండల, మున్సిపల్ ప్రాంతాల్లో 135 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల వివరాలు తెలియజేసేందుకు ప్రధాన సెంటర్లలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా నిర్దేశించిన సమయానికే ఆయా కేంద్రాలకు చేరుకోగలిగారు. 43 మంది లైజనింగ్ అధికారులు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా 64,107 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 48,239 మంది హాజరయ్యారు. 15,868 మంది గైర్హాజరయ్యారు. హాజరు 75 శాతం నమోదైంది. పరీక్ష ముగిసిన అనంతరం ఆయా కేంద్రాల నుంచి ఆన్సర్ షీట్లను పటిష్ట భద్రత మధ్య కలెక్టరేట్‌కు తీసుకువచ్చారు. వాటన్నింటినీ ప్రత్యేక బస్సులో ఏపీపీఎస్‌సీ అధికారులు సాయంత్రం హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు.
Advertisement