చిలకడదుంప లోడులో గంజాయి రవాణా | ganjai seez | Sakshi
Sakshi News home page

చిలకడదుంప లోడులో గంజాయి రవాణా

Published Tue, Nov 29 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

చిలకడదుంప లోడులో గంజాయి రవాణా

చిలకడదుంప లోడులో గంజాయి రవాణా

  • 1,235 కిలోల గంజాయి స్వాధీనం, ఒకరు అరెస్టు
  • రాజమహేంద్రవరం రూరల్‌ : 
    ఐషర్‌వే¯ŒSలో చిలకడదుంపలలోడు మాటున రవాణా అవుతున్న గంజాయి పోలీసులకు చిక్కింది.  దివా¯ŒSచెరువు గామ¯ŒSబ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఐషర్‌వే¯ŒSలో రవాణా అవుతున్న 1235కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్టుచేశారు. మంగళవారం సాయంత్రం బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండల డీఎస్పీ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు, అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి అందిన సమాచారం మేరకు  గామ¯ŒSబ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రరం బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్‌ పి.కనకారావు, బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒS సిబ్బంది, ఏజీఎస్‌ పార్టీతో కలసి వాహనాల తనిఖీ చేస్తుండగా రాజానగరం వైపు నుంచి ఏపి02టిసి 4882 నెంబరు వ్యాన్‌లో చిలగడ దుంపల లోడు కింద రూ.61.75లక్షలు విలువ చేసే 31 మూటల్లోని 1235కిలోల గంజాయి ఉంది. అనంతపురం జిల్లా చెల్లుగుప్ప మండలం కలువపల్లి గ్రామానికి చెందిన వే¯ŒS డ్రైవర్‌ కురుబా రవీంద్ర(రవి)ను రాజానగరం తహసీల్దార్‌ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని విచారించారు. 
    ద్రాక్ష లోడుతో వచ్చి.. గంజాయిలోడుతో దొరికి..
    సదరు వ్యక్తి ఈనెల 24వతేదీన అనంతపురం నుంచి సదరు వే¯ŒSలో ద్రాక్ష లోడు తీసుకుని ఒడిషాలోని బరంపురం వెళ్లి అక్కడ అ¯ŒSలోడ్‌ చేసి తిరుగు ప్రయాణంలో అనకాపల్లి వద్ద ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చి నర్సీపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయిని లోడు చేయించి, హైదరాబాద్‌ గడ్డి అన్నారం వద్దకు తీసుకుని వెళ్ళాలన్నారు. అక్కడ మా మనిషికి సరుకు అప్పగిస్తే అతను అక్కడ నుంచి మహారాష్ట్ర షోలాపూర్‌లో ఉంటున్న మా ఏజెంటుకు పంపిస్తాడని చెప్పి, తనకు అధిక మొత్తంలో డబ్బును వాటాగా ఇచ్చేలా కిరాయికి మాట్లాడుకున్నారని, అందుకు రూ.12వేలు అడ్వాన్సు ఇచ్చారని రవి తెలిపాడన్నారు.  నర్సీపట్నం ఏజెన్సీ ఏరియాలోనికి తీసుకువెళ్ళి అక్కడ తన వే¯ŒSకి గంజాయి మూటలను లోడ్‌ చేయించి, పైన చిలకడ దుంపల లోడు చేశారు. అక్కడ నుంచి ముందుగా ఆరుగురు వ్యక్తులు కారులో వెళుతుండగా వెనుక గంజాయిలోడు వ్యాన్‌ వస్తూ గామన్‌ బ్రిడ్జి వద్ద తనఖీల్లో  దొరికింది.  ఇంతలో డ్రైవర్‌కు ముందు కారులోని వ్యక్తులు ఫో¯ŒS చేయగా ఇ¯ŒSస్పెక్టర్‌ కనకారావు వ్యా¯ŒS ప్యాచీ పడిందని ఆగినట్టు చెప్పించారు. దీంతో వారికి అనుమానం వచ్చి వెనుకకు రాకుండా పరారయ్యారని డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. వే¯ŒS డ్రైవర్‌ రవి వాంగూల్మం మేరకు బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్‌ కనకారావు 1235కిలోల బరువు గల 31 గంజాయి మూటలను, వే¯ŒSను, రూ.12వేలు నగదును నిందితుని నుంచి స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. 
    పరారీలో ఎనిమిది మంది..
    ఈకేసులో 8 మంది ముద్దాయిలను పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నామన్నారు. అర్బ¯ŒS ఎస్పీ రాజకుమారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరుకేసులు పైగా గంజాయి రవాణాదారులను పట్టుకున్నామన్నారు. శిక్ష అనుభవించిన వారు ఎవరూ రవాణా చేయడం లేదని కొత్తవారు ఈ రవాణాకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఇ¯ŒSస్పెక్టర్‌ కనకారావు, ఎస్సైలు నాగేశ్వరరావు, కిషోర్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement