GANJAI SEEZ
-
1,550 కేజీల గంజాయి స్వాధీనం
నక్కపల్లి/నెల్లూరు(క్రైమ్): అనకాపల్లి జిల్లాలో రూ.31 లక్షలకు పైగా విలువ చేసే 1,550 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి నుంచి విజయవాడ మీదుగా తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్నారని శనివారం తెల్లవారుజామున సీఐ నారాయణరావు, ఎస్ఐ వెంకన్నలకు సమాచారం అందింది. వారు వెంటనే తమ సిబ్బందితో కలిసి కాగిత టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన గూడ్స్ వ్యాన్‌లో తనిఖీలు చేయగా.. గంజాయి ప్యాకెట్లు లభించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, వ్యాన్‌ను సీజ్ చేశారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన డ్రైవర్ షబ్బీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని శ్యామ్‌రాజ్ అనే వ్యక్తికి గంజాయిని అప్పగించేందుకు అనకాపల్లిలో లోడింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నెల్లూరులో 62 కేజీల గంజాయి స్వాధీనం విజయవాడ నుంచి చెన్నైకి స్కార్పియో వాహనంలో తరలిస్తున్న 62 కేజీల గంజాయిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు, తమిళనాడుకు చెందిన డ్రైవర్ ముత్తుమురుగన్‌ను అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన కార్తీక్ ఆదేశాల మేరకు విజయవాడలోని సత్తిబాబు దగ్గర నుంచి గంజాయి తీసుకెళుతున్నట్టు విచారణలో ముత్తుమురుగన్ వెల్లడించారు. గంజాయి విలువ రూ.3.10 లక్షలు ఉంటుందని, ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథరెడ్డి చెప్పారు. -
గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
గంజాయి సరఫరా కేసులో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ హాథీరామ్ను రాచకోండ పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి సినిమా ఆర్టిస్టులకు హాథీరామ్ గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి దాదాపు 190 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాథీరామ్ కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి సినిమాలకు హాథీరామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కారులో గంజాయిని హాథీరామ్ సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. దీనిపై తమకు కొద్ది రోజుల క్రితమే సమాచారం అందిందని. సోమవారం ఖచ్చితమైన సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఈ కేసులో హథిరామ్తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ కేసులో హాథీరామ్ను ఏ2 నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
కారులో గంజాయి స్వాధీనం
బైక్‌ను ఢీకొనడంతో వెలుగుచూసిన వైనం l రూ.15 లక్షల విలువైన 200 కిలోల సరుకు స్వాధీనం రావులపాలెం : జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న కారు.. ఓ మోటార్ బైక్‌ను ఢీకొనడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. సుమారు రూ.15 లక్షల విలువైన 200 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. సోమవారం రావులపాలెం పోలీసు స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పీవీ రమణ, ఎస్సై పీవీ త్రినాథ్ ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయి ప్యాకెట్లతో కారు రాజమహేంద్రవరం వైపు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వైపు జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తోంది. ఈతకోట సెంటర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఓ బైక్‌ను ఢీకొనగా, అదే గ్రామానికి చెందిన వెలిగట్ల రామకృష్ణ గాయపడ్డాడు. కారు ముందు చక్రం ఊడిపోవడంతో, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు చక్రం బిగించుకునే పనిలో పడ్డారు. అక్కడ గుమిగూడిన స్థానికులను చూసి వారు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న రావులపాలెం ఎస్సై త్రినాథ్ అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి తరలించారు. కారును పరిశీలించగా, డిక్కీలో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. కారును పోలీసు స్టేష¯ŒSకు తరలించారు. సోమవారం ఉదయం తహసీల్దార్ సీహెచ్ ఉదయభాస్కర్ సమక్షంలో కారు డిక్కీ, వెనుక సీటులో ఉన్న గంజాయి ప్యాకెట్లను వెలికితీశారు. రెండు కిలోల వంతున మొత్తం 104 బ్యాగులున్నట్టు గుర్తించారు. దీని విలువ రూ.15 లక్షలుంటుందని అంచనా వేశారు. గంజాయితో పాటు రూ.70 వేల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అన్నవరం గుడికి వెళ్లినట్టు రసీదు, మెడికల్ బిల్లు ఉన్నాయి. కారులో ఏపీ రిజిస్ట్రేష¯ŒS, తమిళనాడు రిజిస్ట్రేష¯ŒSతో రెండు వైపులా ముద్రించిన నంబరు ప్లేటు దొరికింది. కారు రికార్డు ఆధారంగా నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్సై త్రినాథ్, ఏఎస్సై ఆర్వీ రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సతీష్, ఇతర సిబ్బందిని అభినందించారు. -
చిలకడదుంప లోడులో గంజాయి రవాణా
1,235 కిలోల గంజాయి స్వాధీనం, ఒకరు అరెస్టు రాజమహేంద్రవరం రూరల్ : ఐషర్వే¯ŒSలో చిలకడదుంపలలోడు మాటున రవాణా అవుతున్న గంజాయి పోలీసులకు చిక్కింది. దివా¯ŒSచెరువు గామ¯ŒSబ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఐషర్వే¯ŒSలో రవాణా అవుతున్న 1235కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్టుచేశారు. మంగళవారం సాయంత్రం బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండల డీఎస్పీ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు, అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి అందిన సమాచారం మేరకు గామ¯ŒSబ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రరం బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్ పి.కనకారావు, బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒS సిబ్బంది, ఏజీఎస్ పార్టీతో కలసి వాహనాల తనిఖీ చేస్తుండగా రాజానగరం వైపు నుంచి ఏపి02టిసి 4882 నెంబరు వ్యాన్‌లో చిలగడ దుంపల లోడు కింద రూ.61.75లక్షలు విలువ చేసే 31 మూటల్లోని 1235కిలోల గంజాయి ఉంది. అనంతపురం జిల్లా చెల్లుగుప్ప మండలం కలువపల్లి గ్రామానికి చెందిన వే¯ŒS డ్రైవర్ కురుబా రవీంద్ర(రవి)ను రాజానగరం తహసీల్దార్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని విచారించారు. ద్రాక్ష లోడుతో వచ్చి.. గంజాయిలోడుతో దొరికి.. సదరు వ్యక్తి ఈనెల 24వతేదీన అనంతపురం నుంచి సదరు వే¯ŒSలో ద్రాక్ష లోడు తీసుకుని ఒడిషాలోని బరంపురం వెళ్లి అక్కడ అ¯ŒSలోడ్ చేసి తిరుగు ప్రయాణంలో అనకాపల్లి వద్ద ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చి నర్సీపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయిని లోడు చేయించి, హైదరాబాద్ గడ్డి అన్నారం వద్దకు తీసుకుని వెళ్ళాలన్నారు. అక్కడ మా మనిషికి సరుకు అప్పగిస్తే అతను అక్కడ నుంచి మహారాష్ట్ర షోలాపూర్‌లో ఉంటున్న మా ఏజెంటుకు పంపిస్తాడని చెప్పి, తనకు అధిక మొత్తంలో డబ్బును వాటాగా ఇచ్చేలా కిరాయికి మాట్లాడుకున్నారని, అందుకు రూ.12వేలు అడ్వాన్సు ఇచ్చారని రవి తెలిపాడన్నారు. నర్సీపట్నం ఏజెన్సీ ఏరియాలోనికి తీసుకువెళ్ళి అక్కడ తన వే¯ŒSకి గంజాయి మూటలను లోడ్ చేయించి, పైన చిలకడ దుంపల లోడు చేశారు. అక్కడ నుంచి ముందుగా ఆరుగురు వ్యక్తులు కారులో వెళుతుండగా వెనుక గంజాయిలోడు వ్యాన్ వస్తూ గామన్ బ్రిడ్జి వద్ద తనఖీల్లో దొరికింది. ఇంతలో డ్రైవర్‌కు ముందు కారులోని వ్యక్తులు ఫో¯ŒS చేయగా ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు వ్యా¯ŒS ప్యాచీ పడిందని ఆగినట్టు చెప్పించారు. దీంతో వారికి అనుమానం వచ్చి వెనుకకు రాకుండా పరారయ్యారని డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. వే¯ŒS డ్రైవర్ రవి వాంగూల్మం మేరకు బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు 1235కిలోల బరువు గల 31 గంజాయి మూటలను, వే¯ŒSను, రూ.12వేలు నగదును నిందితుని నుంచి స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఎనిమిది మంది.. ఈకేసులో 8 మంది ముద్దాయిలను పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నామన్నారు. అర్బ¯ŒS ఎస్పీ రాజకుమారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరుకేసులు పైగా గంజాయి రవాణాదారులను పట్టుకున్నామన్నారు. శిక్ష అనుభవించిన వారు ఎవరూ రవాణా చేయడం లేదని కొత్తవారు ఈ రవాణాకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు, ఎస్సైలు నాగేశ్వరరావు, కిషోర్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
132 కిలోల గంజాయి పట్టివేత
ఇద్దరు అరెస్టు, వాహనం సీజ్ చింతూరు : ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 132 కిలోల గంజాయిని గురువారం చింతూరు పోలీసులు పట్టుకున్నారు. మోతుగూడెం సమీపంలోని సుకుమామిడి వద్ద గంజాయి లోడుచేసి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు చింతూరు సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ శ్రీనివాస్‌లు చట్టి సమీపంలోని కూనవరం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును తనిఖీ చేయగా ప్లాస్టిక్ సంచుల్లో ఉన్న గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న విశాఖ జిల్లాకుయ చెందిన ప్రభుదాస్, మహారాష్ట్రకు చెందిన ప్రకాష్ పవార్లను అరెస్టు చేసిట్టు ఆయన తెలిపారు. -
రోడ్డు ప్రమాదంతో గంజాయి గుట్టు రట్టు
కొంతమూరు (రాజానగరం ) : రాజానగరం పోలీ సు స్టేషను ప రిధిలోని కొం తమూరులో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంతో గంజాయి అక్రమ రవా ణా గుట్టు రట్టయింది. గోదావరి నదిపై కొత్తగా నిర్మించిన గామన్ బ్రిడ్జి రోడ్డుపై కొవ్వూరు ౖÐð పు వెళ్తున్న లారీని కొంతమూరు వద్ద వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజానగరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాద కారణాలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో కారుకు సంబంధించిన వ్యక్తులు హఠాత్తుగా పరారయ్యారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ కారును సోదా చేశారు. కారు అడుగు భాగంలో నీట్‌గా ప్యాక్ చేసి ఉన్న 27 గంజాయి ప్యాకెట్లు (50 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ శంకర్‌నాయక్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. 50 కిలోల గంజాయి స్వాధీనం చింతూరు : ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆరుగురు సభ్యులుగల అంతర్రాష్ట్ర ము ఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 50 కేజీల గంజాయి, రూ.2.49 లక్షలు, వాహనాన్ని నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మోతుగూడెం వైపు నుంచి భద్రాచలం వైపునకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో చింతూరు సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో రత్నాపురం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుంటే రెండు మూటల్లో గంజాయి లభ్యమైనట్టు సీఐ తెలిపారు. ఒక్కో మూటలో 25 కేజీల చొప్పున 50 కేజీల గంజాయి ఉందన్నారు. గంజాయిని తరలిస్తున్న జార్ఖండ్‌కు చెందిన గణేష్‌కుమార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయప్రకాష్ పాండే, బీహార్‌కు చెందిన దయాశంకర్, ఒడిశాకు చెందిన అవినాష్ బిశ్వాస్, జయ్సింగ్, కాలాచంద్ భక్తును అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.రెండున్నల లక్షలు ఉంటుందని అంచనా. పట్టుబడిన గంజాయిని చింతూరు రేంజ్ అధికారి రాఘవరావు, వీఆర్వో వెంకటరత్నం సమక్షంలో పంచనామా నిర్వహించారు. -
రూ. 5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
కేరళకు చెందిన వ్యక్తి అరెస్టు గోకవరం: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ కారును ఎక్సైజ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సినీఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. కారులో సుమారు రూ. 5 లక్షల విలువైన 236 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ కారు కిర్లంపూడిలోని కృష్ణవరం టోల్‌గేటు వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో టోల్‌గేటు రుసుము చెల్లించి చిల్లర తీసుకోకుండా వెళ్లింది. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అనుమానం వచ్చింది. వారు ఆ కారును వెంబడించారు. కారు డ్రైవర్ గండేపల్లి జాతీయ రహదారి నుంచి గోకవరం మండలంలోకి ప్రవేశించి కామరాజుపేటలోని ఎస్సీ కాలనీ శివారుకు చేరుకున్నాడు. ఇంతలో కారు టైరు పేలిపోవడంతో కారులోని బ్యాగ్‌లు తీసుకుని డ్రైవర్ పారిపోతుండగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంబడించి అతనిని పట్టుకున్నారు. అతను కేరళకు చెందిన ఎన్.సుభాష్ అని తేలింది. అధికారులకు గ్రామస్తులు కూడా సహకరించారు. ఆ సమయంలో సుభాష్‌తో పాటు కాకినాడ విజిలెన్స్ అండ్ ఎక్సైజ్ సీఐ వేణుమాధవ అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరినీ గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో కారులో ఉన్న గంజాయిని గోకవరం తహశీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ సమక్షంలో బయటకు తీశారు. సుమారు 236 కేజీల బరువు గల 118 ప్యాకెట్ల గంజాయి బయటపడింది. దీని విలువ రూ. 5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ గంజాయిని విశాఖ మన్యం నుంచి ముంబయికి తరలిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గోకవరం ఎస్సై ఆర్.శివాజీ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోరుకొండ ఎక్సైజ్ సీఐ నాగార్జున, వీఆర్వో ధర్మరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రూటు మారింది!
జేగురుపాడువద్ద భారీగా పట్టుబడిన గంజాయి విలువ రూ.2 కోట్లు ఐదు వాహనాలు సీజ్ పోలీసుల అదుపులో సూత్రధారి సహా నలుగురు వ్యక్తులు ఇప్పటివరకూ ఏజెన్సీ నుంచి తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, గోకవరం తదితర మండలాల మీదుగా గంజాయి రవాణా జరిగేది. ఇక్కడ పదేపదే దాడులు జరుగుతూండడమో.. మరే కారణమో కానీ.. గంజాయి స్మగ్లర్లు రూటు మార్చినట్టున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గుట్టుగా గంజాయిని అనపర్తి ప్రాంతానికి తీసుకువచ్చి.. అక్కడి నుంచి రవాణా చేస్తున్నారు. ఆదివారం జేగురుపాడువద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టుబడిన వైనాన్ని చూస్తే.. ఈ విషయం నిజమనిపించకమానదు. కడియం : మండలంలోని జేగురుపాడు ఆడదాని రేవు వద్ద ఆదివారం ఉదయం భారీగా గంజాయి పట్టుబడింది. ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు ఈ సరుకును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందున పూర్తి వివరాలు చెప్పేందుకు వారు నిరాకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అనపర్తి సమీపంలోని ఒక రైసుమిల్లు గోడౌన్ నుంచి ఒక లారీ, మరో ఐషర్ వ్యాన్‌లో గంజాయిని తరలిస్తున్నారు. వీటికి మరో ఖాళీ ఐషర్ వ్యాన్, రెండు కార్లు ఎస్కార్టుగా అనుసరించాయని చెబుతున్నారు. అనపర్తిలోని తవుడు గోడౌన్లో నిల్వ ఉంచిన గంజాయిని ఒక్కొక్కటి 24 కేజీల చొప్పున కట్టిన 162 బస్తాల్లో ప్యాకింగ్ చేశారు. వీటిని లారీలో తవుడు బస్తాల మధ్య, వ్యాన్‌లో పుచ్చకాయల లోడు మధ్య ఉంచి గుంటూరుకు తరలిస్తున్నారు. అప్పటికే మాటు వేసిన పోలీసులు ఈ వాహనాలను తనిఖీ చేయడంతో గుట్టు రట్టయింది. పట్టుబడిన గంజాయి విలువ రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రవాణాకు ఉపయోగించిన ఐదు వాహనాలను స్వాధీనం చేసుకుని, మొత్తం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అనపర్తికి చెందిన ప్రధాన సూత్రధారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. గంజాయి రవాణాలో సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి కొంతకాలంగా ఇదే వ్యాపారం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల కారణంగా గతంలో మహారాష్ట్ర పోలీసు అధికారులు సైతం ఇతడిపై దర్యాప్తు చేపట్టేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అప్పట్లో అతడు ఇంట్లో కుక్కలను విడిచిపెట్టి, వెనుకవైపు నుంచి పరారైనట్లు చెబుతున్నారు. అతడు ఇటీవలే అనపర్తి సమీపంలోని పొలమూరులో బంధువులకు చెందిన రైస్‌మిల్లును లీజుకు నడుపుతున్నట్టు కూడా అంటున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లను రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిలిఆ్ల దక్షిణ మండలం డీఎస్పీ పి.నారాయణరావు పరిశీలించారు. అనంతరం ఆయన నేతృత్వంలో ప్రత్యేక బృందాలు అనపర్తిలో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు తెలిసింది.