Published
Tue, Aug 2 2016 11:03 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
లీకయిన పైప్‌ను పరిశీలిస్తున్న ఎఎస్‌ఐ
సీతంపేట : సీతంపేట కస్తూరిబా గాంధీ పాఠశాలలో మంగళవారం ఉదయం గ్యాస్‌పైపు లీకైంది. దీంతో మంటలు చేలరేగాయి. విద్యార్థినులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ జగన్నాధరావు పాఠశాలకు చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యార్థినుల కోసం ఉదయం పూట రాగిజావ వండే సమయంలో పైపు లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం కొండగొర్రె సుబ్బారావు పాలకొండ అగ్నిమాపక శకటానికి ఫోన్ చేశారు. శకటం వచ్చేసరికే మంటలను అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో ప్రత్యేకాధికారిణి రేవతితో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఐటీడీఏ, ఆర్‌వీఎంకు సమాచారం చేరవేశారు.