హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు గోదావరి పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పుష్కర ఘడియలు మరో రోజులో ముగియనుండగా అటు ఆంధ్రప్రదేశ్లోనూ, ఇటు తెలంగాణలోనూ భక్తులు భారీ సంఖ్యలో గోదావరి మాత ఒడిలో పుణ్యస్నానం ఆచరించేందుకు బారులు తీరారు. పైగా శుక్రవారం కూడా కావడంతో తెల్లవారు జామునుంచే పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు.
రాజమండ్రి పుష్కర ఘాట్లకు భారీగా భక్తుల తాకిడి నెలకొంది, అలాగే కొటి లింగాల, గోష్పాద, నరసాపురం, కొవ్వూరు వద్ద పుష్కర ఘాట్లకు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఇక తెలంగాణలో భద్రాచాలంతోపాటు బాసర వద్ద కూడా పుష్కర భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. ముఖ్యంగా బాసరలో పుష్కర స్నానాలు ముగించుకునే ఇప్పటికే సరస్వతీ అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తున్నారు. కాళేశ్వరం, ధర్మపురిలో పుణ్యస్నానాలకు భారీగా భక్తులు వచ్చారు.
పుష్కర ఘడియలు మరొక్కరోజే..
Published Fri, Jul 24 2015 7:12 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement