ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
Published Thu, Sep 1 2016 1:01 AM | Last Updated on Tue, Oct 30 2018 5:28 PM
కల్వకుర్తి రూరల్ :రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి ప్రజల చెవిలో పూలు పెట్టి మోసం చేస్తోందని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేపట్టిన రిలేదీక్షలు బుధవారం 8వ రోజుకు చేరాయి. దీక్షలలో ఎమ్మార్పీఎస్ నాయకులు చెవిలో పూలతో నిరసన వ్యక్తం చేశారు. పలువురు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ సాధించేవరకు ఉద్యమం సాగుతుందన్నారు. దీక్షకు ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మద్దతిచ్చి మాట్లాడారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. దీక్షలో తాలూకా ఇ¯Œæచార్జ్ విష్ణు, మండల అధ్యక్షుడు కృష్ణ, తర్నికల్ నాయకులున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి, మాజీ ఎంపీపీ మాధవయ్య, జేఏసీ నాయకులు మిర్యాల శ్రీనివాస్‌రెడ్డి, పరిపూర్ణచారి, రాఘవేందర్‌గౌడ్, మాజీవార్డుసభ్యులు ఆంజనేయులుగౌడ్, మల్లేపల్లిజగన్, సాధిక్, సదానందంగౌడ్ ఉన్నారు.
కడ్తాల : నియోజకవర్గంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కడ్తాలను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడ్తాల మండల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహారదీక్షలు బుధవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఎంపీటీసీ వెంకటేశ్, పార్వతీ వెంకటేష్, రమేష్, లక్ష్మణ్‌చారీ, రాఘవేందర్ కూర్చున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపార, వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధి చెందిన కడ్తాల గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని, కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్పంచ్ వేణుగోపాల్, ఎంపీటీసీలు లక్ష్మయ్య, వెంకటేశ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరిరెడ్డి, నాయకులు యాదయ్యగౌడ్, చందొజీ, రవీందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రామకృష్ణ, బుచ్చయ్య,లాయక్‌అలీ ఉన్నారు.
Advertisement
Advertisement