- వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌గుప్తా
- బ్యాంక్‌లలో రైతులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి
- ఎన్నికల హామీలు నేరవేర్చాలి
కోహెడ: రాష్ట్ర ప్రభత్వం విద్యరంగాన్ని విస్మరిస్తుందని వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌గుప్తా ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, పెండింగ్ స్కాలర్‌షిప్‌తో కళాశాల యాజమాన్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని.. వెంటనే ఫీజు రియింబర్స్‌మెంటు, పెండింగ్ స్కాలర్‌షిప్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులలేమి తీవ్రంగా ఉందన్నారు.
నీటి సౌకర్యం లేక అనేక పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, 3 ఎకరాలు భూమి, తదితర ఎన్నికల హామీలను ప్రభుత్వం నేరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించినట్లు చెప్పారు. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లోని టెర్రరిస్టులకు కేంద్రం నిర్ణయం చెంపపెట్టులాంటిది అన్నారు. రాష్ట్రంలో నోట్ల కష్టాలు లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నకోడూర్ మండలాధ్యక్షుడు ఎదుల్ల నర్సింహారెడ్డి, జిల్లా నేతలు వజ్రోజు శంకరాచారి, పిడిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగాన్ని విస్మరిస్తున్న సర్కార్
Published Tue, Dec 6 2016 7:32 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement