జిల్లా ఆస్పత్రి ప్రక్షాళన
-
మంత్రి కామినేని శ్రీనివాస్
చిల్లకూరు : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వా ప్రధానాస్పత్రిలో వైద్యుల పనితీరు సరిగ్గా లేదని, త్వరలోనే ప్రక్షాళణ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని వరగలి, వల్లిపేడు గ్రామాల్లో నిర్మించిన నూతన ఆస్పత్రి భవనాలను ఆదివారం ఆయన తిరుపతి ఎంపీ వరప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఈనెల నుంచి ప్రసవం జరిగిన తర్వాత ప్రతి బిడ్డకు రూ.750 విలువ చేసే కిట్టు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆత్మకూరు, అల్లూరు, కలువాయి,చిట్టలూరుతో పాటు పలుచోట్ల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందకపోతే పేదలు ఎక్కడికి వెళ్లగలరని, ఈ విషయాన్ని వైద్యులు అర్థం చేసుకోవాలని సూచించారు.
నిధులతో సోలార్ హీటర్లు
ఎంపీ మాట్లాడుతూ రెండు పీహెచ్‌సీల్లో సోలార్ హీటర్లను ఏర్పాటుచేసేందకు ఎంపీ నిధుల రూ.70 వేల చొప్పున మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. తీరప్రాంత గ్రామాల్లో ఏర్పాటైన పరిశ్రమల యాజమాన్యాలు గ్రామాల్లోని వారికి తప్పనిసరిగా ప్యాకెజీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, జెడ్పీటీసీ ఓడూరు యమునమ్మ, ఎంపీపీ వీరబోయిన రమాదేవి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వరసుందరం, ఇన్‌చార్జి ఆర్డీఓ వెంకటసుబ్బయ్య, డీఎస్పీ శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
50 పడకల ఆరోగ్య కేంద్రం ప్రారంభం
అల్లూరు : మండల కేంద్రమైన నూతనంగా ఏర్పాటుచేసిన 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం రాష్ట్రఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆస్పత్రి ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతంర ఆయన ప్రజలు వేలకువేలు ఖర్చుపెట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వాస్పత్రులను వినియోగించుకోవాలని కోరారు. ఈ సమయంలో మంత్రి మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఆస్పత్రికి కావాల్సిన అధునాతన పరికరాలు అందుబాటులోకి తేవాలని ఆనం కోరారు. ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మేల్యే బీద మస్తాన్‌రావు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకష్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.