minister kaminei srinivas
-
జిల్లా ఆస్పత్రి ప్రక్షాళన
మంత్రి కామినేని శ్రీనివాస్ చిల్లకూరు : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వా ప్రధానాస్పత్రిలో వైద్యుల పనితీరు సరిగ్గా లేదని, త్వరలోనే ప్రక్షాళణ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని వరగలి, వల్లిపేడు గ్రామాల్లో నిర్మించిన నూతన ఆస్పత్రి భవనాలను ఆదివారం ఆయన తిరుపతి ఎంపీ వరప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఈనెల నుంచి ప్రసవం జరిగిన తర్వాత ప్రతి బిడ్డకు రూ.750 విలువ చేసే కిట్టు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆత్మకూరు, అల్లూరు, కలువాయి,చిట్టలూరుతో పాటు పలుచోట్ల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందకపోతే పేదలు ఎక్కడికి వెళ్లగలరని, ఈ విషయాన్ని వైద్యులు అర్థం చేసుకోవాలని సూచించారు. నిధులతో సోలార్ హీటర్లు ఎంపీ మాట్లాడుతూ రెండు పీహెచ్‌సీల్లో సోలార్ హీటర్లను ఏర్పాటుచేసేందకు ఎంపీ నిధుల రూ.70 వేల చొప్పున మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. తీరప్రాంత గ్రామాల్లో ఏర్పాటైన పరిశ్రమల యాజమాన్యాలు గ్రామాల్లోని వారికి తప్పనిసరిగా ప్యాకెజీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, జెడ్పీటీసీ ఓడూరు యమునమ్మ, ఎంపీపీ వీరబోయిన రమాదేవి, డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం, ఇన్చార్జి ఆర్డీఓ వెంకటసుబ్బయ్య, డీఎస్పీ శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 50 పడకల ఆరోగ్య కేంద్రం ప్రారంభం అల్లూరు : మండల కేంద్రమైన నూతనంగా ఏర్పాటుచేసిన 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం రాష్ట్రఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆస్పత్రి ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతంర ఆయన ప్రజలు వేలకువేలు ఖర్చుపెట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వాస్పత్రులను వినియోగించుకోవాలని కోరారు. ఈ సమయంలో మంత్రి మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఆస్పత్రికి కావాల్సిన అధునాతన పరికరాలు అందుబాటులోకి తేవాలని ఆనం కోరారు. ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మేల్యే బీద మస్తాన్‌రావు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకష్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ భాగస్వామ్యంతో మెరుగైన సేవలు
నెల్లూరు రూరల్: ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. సింహపురి స్పెషాల్టీ ఆస్పత్రిలో శనివారం రాత్రి న్యూరో నావిగేషన్ పరికరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో గుంటూరులో ప్రయోగాత్మకంగా వైద్యసేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, విజయవంతమైందని చెప్పారు. సింహపురి ఆస్పత్రి ఎండీ కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, పీఏఓ నాగేంద్రప్రసాద్, వైద్యులు వెంకటేశ్వరప్రసన్న, భక్తవత్సలం, దీక్షాంతి నారాయణ్, గోపాలకృష్ణయ్య, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. పరామర్శ సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు కందుకూరి సత్యనారాయణ కుటుంబసభ్యురాలిని మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, కందుకూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరులోకి వెళ్లు.. నీ సంగతి తేలుస్తారు
సాక్షి విలేకరికి మంత్రి కామినేని ఫోన్లో బెదిరింపు కైకలూరు: ‘కొల్లేరులో ప్రజలే చేపల సాగు చేస్తున్నారు. అక్కడ బడాబాబులెవరూ లేరు. నువ్వు కొల్లేరులోకి వెళ్లు.. నీ సంగతి అక్కడ వాళ్లు చూస్తారు..’ అంటూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కృష్ణాజిల్లా కైకలూరు సాక్షి విలేకరి బి.శ్యామలరాజును బుధవారం ఫోన్లో బెదిరించారు. మంగళవారం విజయవాడలోని ట్రావెలర్స్ బంగ్లాలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కామినేని బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లేరులో చేస్తున్న అక్రమ చేపల సాగుకు సంబంధించి అటవీ శాఖాధికారి వినోద్‌కుమార్‌తో బహిరంగంగా ఫోన్లో మాట్లాడారు. ఆయన స్వాధీనం చేసుకున్న సరుకుతోపాటు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి మనవాడేనంటూ.. గంటలోపు వదిలివేయాలని హుకుం జారీ చేశారు. ఆ సమయంలో పార్టీ వార్త కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరి శ్యామ్.. మంత్రి అటవీశాఖ అధికారితో ఫోన్లో సాగించిన సంభాషణను వార్తగా మలిచారు. ‘ఆ సరుకు మనోడిదే వదిలెయ్’ శీర్షికతో జిల్లా టాబ్లాయిడ్లో మంగళవారం ప్రచురితమైంది. ఇది చదివిన మంత్రి బుధవారం సాక్షి విలేకరికి ఫోన్ చేసి పై విధంగా హెచ్చరించారు. నీవు రాసే వార్తలతో రెండు పత్రికల విలేకరులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.