ప్రైవేట్ భాగస్వామ్యంతో మెరుగైన సేవలు
ప్రైవేట్ భాగస్వామ్యంతో మెరుగైన సేవలు
Published Sat, Jul 30 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
నెల్లూరు రూరల్: ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. సింహపురి స్పెషాల్టీ ఆస్పత్రిలో శనివారం రాత్రి న్యూరో నావిగేషన్ పరికరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో గుంటూరులో ప్రయోగాత్మకంగా వైద్యసేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, విజయవంతమైందని చెప్పారు. సింహపురి ఆస్పత్రి ఎండీ కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, పీఏఓ నాగేంద్రప్రసాద్, వైద్యులు వెంకటేశ్వరప్రసన్న, భక్తవత్సలం, దీక్షాంతి నారాయణ్, గోపాలకృష్ణయ్య, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ
సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు కందుకూరి సత్యనారాయణ కుటుంబసభ్యురాలిని మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, కందుకూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement